మిణుగురుపురుగు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇది జపాన్ దేశపు జానపదకథ.ఒక కట్టెలు కొట్టి అమ్ముకునే వాడికి పిల్లలులేరు.అందుకే ఆ ఆలుమగలు ఇద్దరు ఎప్పుడూ బాధపడుతూ దేవుని ప్రార్ధించేవారు"దేవా!మాఇంట్లో చిన్న పిల్లలు నడయాడాలి"అని. ఊరిచివర ఉన్న పూరిగుడిసెలోంచి భార్య రోజూ ఫ్యూజియామా కొండల ను చూస్తూ ఉండేది. ఒక రోజు ఆకొండపైన ఓఅందాలపాప మెరిసిపోతూ కనపడింది. తనవైపు చేయిఊపుతూన్నట్లు ఆమెకి అనిపించింది. మగడు ఇంటికి రాగానే "ఏమయ్యోయ్!ఓముద్దులమూట పాపాయి నావైపు చేయిచాపి "రా..రా"అని పిలిచింది. రేపు అక్కడి కి వెళ్లుదామా?"అని అడిగితే "సరే"అన్నాడు. ఆరోజు వారిద్దరూ ఆకొండదగ్గరకు వెళ్లారు."నేను చందమామ కూతురి ని. మీకు పిల్లలులేరని బాధపడుతున్నారు గదా?నన్ను తీసుకుని వెళ్లి పెంచుకోండి"అంది.భర్త ఆమెని భుజాల పై కూచోపెట్టుకుని నడుస్తూ ఉంటే భార్య  ఆపాప తో తనివితీరా కబుర్లు చెప్పింది.ఆరోజు నించి ఆఇంటిలో ఆనందం సంతృప్తి తాండవం చేయసాగాయి.ఆపాప పెరిగిపెద్దదైంది.ఆదేశ రాకుమారుడు వేటకై అటుగావచ్చినపుడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై "నీకూతురుని నాకిచ్చి పెళ్లి చేయి"అని అడిగాడు. రాణీ గా కూతురు సుఖభోగాలు అనుభవిస్తుంది అని ఆదంపతులు సరే"అన్నారు.ఆఅమ్మాయిమాత్రం"నేను చంద్రుడి కూతురుని.మనిషి తో నాకు పెళ్లి కుదరదు.మీకు బిడ్డలులేని లోటు తీర్చాలని వచ్చాను.నాకూ మాలోకానికి వెళ్లే సమయం వచ్చింది"అంది.ఇది తెలుసుకున్న రాకుమారుడు  ఆఇంటిచుట్టూ గట్టి కాపలా పెట్టి "ఎలాగైనా ఆమెను నాదాన్నిగా చేసుకుంటా"అని మొండికేశాడు.ఆరోజు పున్నమి. మెరిసిపోతున్న చందమామ స్వయంగా వచ్చి తన కూతురు ని తన లోకానికి తీసుకుని వెళ్లి పోయాడు. ఆపిల్ల ఇన్నాళ్ళూ తనను పెంచి పెద్ద చేసి న వారి ని విడిచి పోతూ కన్నీరు కార్చసాగింది.అవి ముత్యాల లాగా కింద కి రాలసాగాయి.అవే రాత్రి పూట మిణుగురుపురుగులులాగా మెరుస్తాయి అని జపాన్ వారి నమ్మకం. 🌷
కామెంట్‌లు
Unknown చెప్పారు…
కథ చప్పగా ఉంది...కథలో మలుపులు లేవు