- పుస్తకం. ;-సావిత్రి కోవూరు;-కలం స్నేహం
అలరించునది, ఆహ్లాదమును కలిగించునది
అందరిలో ప్రత్యేకతను కలిగించునది
ఆనందము కూర్చునది మర్యాదను, 
మనుగడను నేర్పునది ఫుస్తకంబు.

విజ్ఞానమును, వినయమును కలుగజేయు
భుక్తిని, యుక్తిని కలుగజేయు.
ఒంటరి తనమును తరిమివేయు,
బంధువుగా హితము నేర్పు పుస్తకంబు

ప్రపంచమును ప్రముఖమునుంచి 
విశ్వదర్శనంబు గావించు, వివేకుల కలుపు
మానసికోల్లాసము గావించు, మంచి మనష్యుల కలిపి, మంచి జీవితం చేకూర్చు పుస్తకంబు.

చారిత్రక విశేషాలు తెలిపి చరిత్రలు తెలుపు,
భువినేలిన చక్రవర్తుల తెలుపు, రాజుల తలుపు,
వారి తప్పదాలు తెలుపు, ఒప్పిదాలెన్నో తెలుపు,
బాధ్యతలు తెలిపి బాటలూ తెలుపు పుస్తకంబు.

సత్ప్రవర్తన నేర్పు, సాంప్రదాయం నేర్పు,
భాషలెన్నో తెలుపు, భవిత తెలుపు,
లోకరీతి తెలుపు, లౌక్యంబు నేర్పు,
మార్గదర్శిగ మారి, మన శ్రేయోభిలాషియైన ఏకైక స్నేహితుండౌ పుస్తకంబు.


కామెంట్‌లు