బ్రతుకుబాట, *సొంతఇంటి కల *కోరాడనరసింహా రావు!

  ***   53   ***
అద్దె ఇళ్లలో... పడినన్నాళ్ళూ 
పాట్లు పడ్డాం... బాగుబంధా ఇళ్లలో నైనా... ప్రశాంతంగా ఉందా మంటే... ప్రతి రెండేళ్లకీ 
ఇంకా ఎక్కువడబ్బు కావాలనటమో... ఖాళీ చేసేయమనటమో... !
"ఎన్నాలురా ఈ తిప్పలు... మనలాంటి ఇల్లు లేనివారికి 
ప్రభుత్వం వారు... ఇళ్లో... ఇళ్ల 
స్థలాలో ఇస్తున్నారటకదా... !
ప్రయత్నించురా... మనకీ తిప్పలు తప్పుతాయి... !"
అమ్మబాధపడుతూ  అనటం తో...నేనూ ప్రయత్నించాను !
గ్రామకరణాన్ని ఎన్నిమార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది !
అప్పుడే... ప్రభుత్వం వారు సొంత ఇల్లు లేనివారికి.. ఆ పార్టీ Mla.ఎర్రకృష్ణమూర్తి  పేరు మీద... పార్వతీపురం బెలగాం కి... నరిసిపురానికీ మధ్య సెటిలైట్ టౌన్షిప్ పేరుతో... ఇళ్లకోసం పెద్దకోలనీ ఇస్తున్నారని ఇల్లు లేని వారు  అప్లికేషన్ పెట్టుకోవచ్చని తెలిసి 
నేనూ ప్రయత్నించాను !
మా కరణం నాతోపాటు అప్లి  కేషన్  పెట్టుకున్న అందరికీ పిలిచి పట్టాలిచ్చాడు... ఒక్క నాకు తప్ప !... నా చిన్నప్పటినుండీ అతన్ని చూస్తున్నాను... ఓ పెద్ద ఖాకీ నిక్కరుతో... మెదరివీధి జంక్షన్లో 
కిళ్ళీబడ్డీదగ్గరతిరువుతుండేవాడు !
అలాంటి వాడు... గ్రామ కరణం అయినతరువాత... బాగా మారిపోయాడు..!
డబ్బులు పడనిదే.... ఏ పనీ జరగని చ్చే వాడు కాదు  !!
 ఓ రోజు... మావీధిలోని పిన్నివరస... ఒకావిడ వచ్చి... 
ఒరే బాబు... ఆ కరణం కి ఓ ఐదువందలిచ్చేయరా... నీకు ఇంటి పట్టా ఇచ్చేస్తాడు... అని అనటం... నేను ఐదువందలు.. 
తీసుకువెళ్లి అతని కి వ్వ టం... 
నాచేతిలో పట్టా పెట్టి అందులో 
నీ స్థలం నెంబర్ ఉంది... ఆ స్థలంలో ఇల్లుకట్టుకో అని చెప్పటం తో... ఎంతో ఆశతో అక్కడికి వెళ్లాను !
అక్కడ అప్పుడే చాలామంది ఇల్లుకట్టుకుంటున్నారు... వాళ్లందరికీ... మెయిన్రోడ్ కి దగ్గరలో స్థలాలొచ్చాయి...!
నాకు ఆఖరిలో స్థలం ఇవ్వటం వలన... ఆ ఇళ్ళన్నిటికీ చాలా దూరంగా... చివారన నాకిచ్చిన స్థలం తరువాత మరి స్థలాలేవీ లేవు ఒక పెద్ద చెరువుతప్ప !!
వృద్ధురాలైన తల్లి, ఫిట్స్ రోగం తో భార్య... ముగ్గురు చిన్న పిల్లలు... బ్రతుకుతెరువు టౌన్ లో... ఇంటికి స్టూడియో కి నాలుగు మైళ్ళు దూరం... !
ఐనా సొంత ఇల్లు అనే ఆశతో 
LIC... లోన్ పెట్టి... ప్రక్కనే మరో ఇల్లు కడుతున్న మేస్త్రీకి 
కాంట్రాక్టు ఇచ్చేసాను !
ఈ సమాజం లో... అన్ని రంగాల్లోనూ మంచివాళ్ళూ, చెడ్డ వాళ్ళూ కూడ ఉండటం సహజమే కదా... ! ఐతే అదృష్ట వంతులకి... మంచివారు దొరికితే... నాలాంటి దురదృష్ట వంతులకి..కంత్రీగాలే దొరుకుతారు !
వాడు మహా మోసగాడు... ఇటిక, ఇసుక ప్రతిదానిలోనూ కమీషనే... !
ఇటిక బెడ్డలైతే  700 వందలే తెప్పించి.. వెయ్యి బెడ్డలకు డబ్బులు వసూలు చేసేవాడు!
అడుగడుగునా మాయ, మోసమే... !LIC.. లోన్... ప్రభుత్వమ్ వారు ఇచ్చిన సిమెంట్, వస్తువులు...అన్నీ 
ఐపోయాయి... ఐనా ఇల్లుమాత్రం పైన స్లాబ్... చుట్టూ గోడలు అంతవరకే ఇల్లు తయారయింది !
డబ్బుకోసం... కొంతకాలం... !
ఇంక ఇల్లుకట్టలేనని తేలిపోయింది !
తెచ్చిన అప్పుకు వడ్డీ పెరిగిపో  తోంది !
అమ్మేద్దామంటే... కొనేవాళ్ళు లేరు... !అప్పుడు మా చిన్నింధీ మాష్టారే... ఆదుకున్నారు !
ఆ ఇంటిని ఆయనే కొన్నారు !
పూర్తిగా నష్టపోకుండా... 
అంతవరకూ జరిగిన నష్టం తోనే గట్టెక్క గలిగాను!!
మా కరణం లాంటి వాళ్ళు.. 
ఈ తాపీ మేస్త్రీ లాంటివాళ్లు ఉన్న ఈ సమాజంలో... నా లాంటి అసమర్ధుడు యే కార్యాన్నీ సాధించలేడు !
మా లాంటి వాళ్లకు... ప్రభుత్వం వారు... కనీస సౌకర్యాలతో ఓ చిన్నఇల్లును...ఇచ్చి... మాటాడనంతరం మళ్ళీ ఆ ఇంటిని... మాలాంటి మరొకరికి ఇస్తే... ఎంత ప్రయోజనకరం గా 
ఉంటుందో... అనిపంచింది !
సమాజం లో... మా కరణం లాంటివాళ్లే ఎక్కువ... !
అతడ్ని Acb.. వాళ్ళు పట్టుకున్నా... వెంటనే ఊర్లో కాలరెగరేస్తూ తిరిగే పరిస్థితి !
అతడినెవరూ ఎదురుగా నిండించినోళ్లు లేరు ! ఎప్పటిలానే గౌరవ, మర్యాదలు 
NTR.. వచ్చి గ్రామకరణాల వ్యవస్థను రద్దుచేసామన్నారు!
ఏం మారింది... !? VAO..Vro...
పేరులే మారాయి... పరిస్థితులేమీ మారలేదు !!
ఏది ఏమైనా... నా సొంత ఇంటి కల... కలగానే... 
మిగిలిపోయింది....!!
     ******
  ......    సశేషం ........
కామెంట్‌లు