కన్నయ్య ;-కిరణ్మయి

 నా మదిలో ఊహల ఊయలలు ఊగేవేళా ..,
ఆశల కుసుమము రాలేవేళా..,
కోయిల కుహు కుహు రాగాలాపన సాగేవేళా..,  
నా చెలికాడి చురకత్తుల చూపులు
మా..చెదరని ప్రేమకు శ్రీకారమై ..,
మా అనురాగానికీ ఆనవాళమై..
అరవిరిసిందీ..  ఓ.. చిరుకుసుమం!
మా కళ్ళల్లో కోటి కాంతులు నింపినా..నాటి  ఆ..క్షణం.. నేటికీ ఎంతో ప్రియం!

ముద్దుగుమ్మలా ముచ్చట్లు
మొలక నవ్వులు..,
గుబాలించే  గులాబీలు
మేళవించినా..నా..కన్యయ్యంటే మా కెంతో ప్రాణం.

కామెంట్‌లు