ఐకమత్యమే మహాబలం; వెంకట రమణ రావు

 వర్షాలు బాగా కురుస్తున్నాయి . స్కూల్ కి సెలవులు ఇచ్చారు. పిల్లలు ఇంట్లో ఉండిపోయారు.
 టీచర్ ఇచ్చిన హోమ్ వర్క్ లు చేసుకుంటున్నారు. మాధవ్ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చెట్టు కొమ్మ ఇంటికి అడ్డంగా పడిపోయింది . ఇంట్లో అమ్మ తప్ప ఎవరు లేరు. ఏం చెయ్యాలా అని మాధవ్ ఆలోచించాడు . చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ కూడగట్టుకున్నాడు, క్లాస్ లో టీచర్ చెప్పిన " ఐకమత్యమే మహాబలం అన్న పాఠం గుర్తు వచ్చింది . ఫ్రెండ్స్ అందరినీ అడిగాడు మనం అందరు పది మంది ఉన్నారు , ఎలాగైనా ఈ చెట్టు కొమ్మని పక్కకి లాగుదాము అని. అమ్మో ఇంత పెద్ద కొమ్మని ఎలా లాగడం , పెద్దవాళ్ళని అడుగుదాం అన్నారు కొంత మంది ఫ్రెండ్స్. ఐకమత్యమే మహాబలం పాఠం ఒకసారి గుర్తు తెచ్చుకోండి .వలలో చిక్కుకున్న పక్షులు అన్నీ ఒక్క సారి ఎగిరిపోయాయి కదా వేటగాడు వచ్చే సరికి  . మరి అంత పెద్ద  వలని పక్షులు పైకి లేపినప్పుడు మనం  మాత్రం ఈ కొమ్మని ఎందుకు లాగలేము , ప్రయత్నిద్దాం పదండి. మా అమ్మ మన అందరికీ బజ్జీలు వేడి వేడి గా పెడుతుంది అని చెప్పాడు. పిల్లలు అందరూ ఒక లైన్ లో నిలబడి కొమ్మను పట్టుకుని అందరూ ఒకే సారి  మెల్లిగా లాగారు. కొమ్మ మెల్లిగా కదిలింది . ఇంతలో మాధవ్ ఇంట్లో నుంచి ఒక తాడు పట్టుకొచ్చాడు . కొంచెం కదిలిన   కొమ్మ మధ్య లో అందరు కలిసి గట్టిగా కట్టారు . ఆ తాడు పట్టుకుని స్కూల్ బలపరీక్ష ఆడినట్టు కొమ్మ ఒక వైపు , పిల్లలు అందరూ ఒక వైపు అన్నట్టుగా ఆ కొమ్మని అవలీలగా లాగారు. ఇప్పుడు మాధవ్ ఇంటికి  ఏ  అడ్డంకి లేదు. పిల్లలు అందరూ ఐకమత్యమే   మహా బలం అంటూ అరిచారు.
కాళ్లు చేతులు కడుక్కుని రండి  పిల్లలూ , మీకు బజ్జీలు రెడీ అంటూ పిలిచింది మాధవ్ వాళ్ళ అమ్మ అందరినీ.  కేరింతలతో ఇంట్లోకి దారి తీశారు పిల్లలు.

కామెంట్‌లు