నూతన ప్రణాళికలతో ఆంగ్ల సంవత్సరాది కి స్వాగతం.; డా : సూర్యదేవర రాధారాణి
 మారుతున్నది పుటొక్కటే…. మరచిపోకు
విదేశసంప్రదాయ మోజులో వెంపర్లాడకు
హైందవ సంస్కృతిని అలుసుచేయకు 
చూడచక్కని  తెలుగు  సున్నితంబు !

ఆధునికతంటే అర్ధము తెలుసుకో
మారాలి అవసరము ఉన్నంతవరకే
మానాలి ఆర్భాటాలు మొత్తానికే
చూడచక్కని తెలుగు సున్నితంబు !

ప్రతిరోజూ మారవచ్చు మంచివైపు
కొలతేమీ లేదుకదా …. ప్రతిభచూపు
తలయెత్తి నిలబడుటే కొసమెరుపు
చూడచక్కని  తెలుగు  సున్నితంబు !

మనదికాని వేడుకలవి వదలవోయి
మంచిదైతే ఏదైనా పట్టవోయి
మానవత్వము తోడుగా నడవవోయి
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఆంగ్లసంవత్సరాది పండుగా దండుగా
ప్రధమముగా వెర్రికళలు వెయ్యడమేగా
మరుదినము షరా మామూలేగా!!
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కామెంట్‌లు