చంద్రకళ కు *సుధీతిలక* బిరుదు ప్రదానం


 తెలుగు సాహిత్యములో శ్రీమతి నెల్లుట్ల సునీత గారు రూపొందించిన *సున్నితం* నూతన సరళ శతకం ప్రక్రియలో *ద్విశతాధిక సున్నితాలు* లిఖించినందుకు గాను,తెలుగు సాహిత్యంలో చేస్తున్న విశేష కృషికి గానూ *సాహితీ బృందావన జాతీయ వేదిక*సంస్థ వారిచే *సుధీతిలక* బిరుదును వాట్స్ యాప్ వేదికగా... మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి *చంద్రకళ. దీకొండ* గారికి ప్రదానం చేయడం జరిగింది.పురస్కార గ్రహీత శ్రీమతి *చంద్రకళ. దీకొండ* గారిని సంస్థ సలహాదారు, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు,కార్యదర్శి వాకిటి రాంరెడ్డి గారు,అధ్యక్షురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత గారు,తోటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,సాహితీ మిత్రులు,విద్యార్థినీ విద్యార్థులందరూ అభినందించడం జరిగింది.


కామెంట్‌లు