నూతన ప్రణాళికలతో ఆంగ్ల సంవత్సరాది కి స్వాగతం. బిచ్చాల సౌందర్య
 నవ్యప్రణాళికలతో నవ్యానికి నాందిపలుకు
 ఆశయసాధనతో అడుగడు ముందుకు 
గతఅనుభవాలు గుణపాఠం భవిష్యత్తుకు
చూడచక్కని తెలుగు సున్నితంబు


నైతిక సిద్ధాంతాలతో నడుంకట్టాలి
సుగుణాల మూర్తిమత్వమే ధరించాలి
మననిర్ణయాలు ఇతరులకు హితమవ్వాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు


ఆరోగ్య జాగ్రత్తలే  పాటిద్దాం 
మెలకువతో బ్రతుకమని ప్రకటిద్దాం
కరోనా కష్టాలను కడతేర్చేద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు


విఘ్నాలు ఎదురైన దృడసంకల్పం
సమస్యలు తలెత్తిన పరిష్కారం
జీవన పోరాటమే జీవితం 
చూడచక్కని తెలుగు సున్నితంబు 


అభ్యుదయ పాటవంతో పయనిద్దాం
ఉజ్జ్వల భవితనే స్వాగతిద్దాం
సకలజనుల సంతసమే ఆశిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు