. నీ ఉనికిని కాపాడుకో....;-విష్ణు ప్రియ;-కలంస్నేహం.
అనంత విశ్వంలో...
అద్భుతమైన జీవరాసుల మనుగడలో..
ఉత్క్రుష్టమైన మానవజన్మ నెత్తి....
విజ్ఞానార్జనలో అవని నుండి ఆకాశం దాకా....
అణువణువూ శోధించి,ఎన్నెన్నో సాధించి...
అజేయుడవై,అత్యున్నత శిఖరాలనధిరోహించినా...

ఆగని నీ కాంక్షల తృష్ణలో...
సృష్టికి ప్రతిసృష్టి చేయుచూ..
ప్రకృతిని శాసిస్తూ....
నీ ఉనికిని నీవు కోల్పోతున్నావని తెలియని మూర్ఖత్వంలో మునిగి...
వేవేల పరిశ్రమల స్థాపనలో....
ప్లాస్టిక్ వినియోగంలో...
కాలు కిందపెట్టని సుఖ జీవన వాహన యాత్రలో...

వాయు కలుష్యమొనరించి...
భూగ్రహాన్నే కలుషితం చేసి..
నవ గ్రహాల శోధనలో లీనమై..
ప్రకృతిని రక్షించే ఓజోన్ పొర చిరుగులు పడి...
భువికి చేరు అతినీలలోహిత కిరణాలు...

నిన్నే అంతం చేయు చివరికి...
భగ, భగ మం

డే అగ్నికీలలే నిన్ను దహించును...
ఓ మానవా ఇకనైనా మేలుకో...
నీ మేధస్సు గొప్పదని నిరూపించుకో...

ప్రకృతిని కాపాడి....
హరితవర్ణపు శోభలద్ది...
సకల జీవకోటి ప్రాణాలకు విలువిచ్చి....
ముందు తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి వనరులిచ్చి...
కాపాడుకో నీ ఉనికిని.....

కామెంట్‌లు