నూతన ప్రణాళికలతో ఆంగ్ల సంవత్సరాది కి స్వాగతం. మద్ది.పుల్లారావు
 రెండువేలిరవై రెండు లేమి తొలగి
సాగిపోవలె జీవితాలు చక్కగాను
కోరుచుంటి శుభములు సర్వులకును
చూడచక్కని తెలుగు సున్నితంబు.


రంగవల్లులతో స్వాగతము ఘనంగా
దైవపూజలతో ప్రారంభించు భక్తి గా
మిఠాయిలు పంచిపెట్టు ప్రేమగా
చూడచక్కని తెలుగు సున్నితంబు


పాత సమస్యలు పారిపోయి
కొత్త ఆనందాలు కోరివచ్చి
మోములందు మోదము వికసించవలె
చూడచక్కని తెలుగు సున్నితంబు

కొత్త సంవత్సరం ఆశలకొండ
ప్రకాశించాలి సమతావాదమను పూదండ
మేలు చేయు దేవదేవుని అండ
చూడచక్కని తెలుగు సున్నితంబు

విజ్ఞానాన్ని జాగృతము చేయుటకై
దీనజనులను ఉద్దరించుట కొరకై
అంధకారాన్ని తొలగించ అర్ధించు
చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు