బ్రతుకుబాట:- పాపాలింకా పూర్తిగా ప్రక్షాళన కాలేదా... !కోరాడ నరసింహా రావు
 
      **  43  **
నీ పాపాలింకా పూర్తిగా ప్రక్షాళన 
కాలేదని గుర్తు చెయ్యటానికి 
కాబోలు ఇంకా ఆ పరమాత్మ బాధలను చవిచూపిస్తూనే ఉ న్నాడు... !
ఓ మారు నాకు జ్వరం వొచ్చి... 
మెడికల్ స్టోర్ లో టాబ్లెట్ లు 
తెచ్చివాడినా తగ్గలేదు !మా 
దేవాంగుల వీధిలో డాక్టర్ దొడ్డి పరశురామ్Mbbs. అనే ఆయన హాస్పెటల్ ఉండేది... అక్కడ అతనికంటే ముందు తాడ్డి గంగయ్య నాయుడు అని mbbs..డాక్టర్ ఉండేవారు... 
ఈ గంగయ్యనాయుడు గారే మునుపు రెండుమార్లు టైఫా యిడ్ వచ్చినపుడు బాగు చే సారు... ఆరోజుల్లో మాఊరి మొత్తానికి టౌన్ లో బోటు  లింగరాజు గారు,గంగయ్య నాయుడు... ఇద్దరే ఉండేవారు, 
లింగరాజుగారు... యే జబ్బు కైనా పూర్తిగా నయం చెయ్యటా నికి రోజూ ఇంజక్షన్, టాబిలెట్లు ఆయనేఇవ్వటాo...ఖచ్చితంగా రోజుకి ఇంత అవుద్ది అని ఆయన ఎంత చెబితే అంతా ఏరోజు కారోజు ఫీజు ఇచ్చెయ్య టానికైతేనే... ఒప్పు కునే వారు... డబ్బులిచ్చుకోలేని వాళ్ళనుఅస్సలుచూసేవారేకాదుఇతనిమీదగంగయ్యనాయుడుకొంత బెటరు... !
బెలగాం లో ఒకే డాక్టర్... బాపిరాజు గారు తరువాత వారి కొడుకు సన్యాసి రాజు గారు... తండ్రికంటే కొడుకుకే మంచి పేరుండేది ఎవరు ఎంత ఇచ్చుకోగలిగితే అంత !డిమాండ్ ఉండేది కాదు... ఐనా మాకు అందుబాటులో దేవాంగుల వీధి డాక్టర్ దగ్గరకే వెళ్ళేవాళ్ళం !
పరశురామ్ గారు ఆ రోజుల్లో రెండు రూపాయలు తీసుకుని 
ఏ జబ్బుకైనా ఓ పెన్సిలిన్ ఇంజక్షన్ చేసి ఓ రెండు మాత్రలిచ్చేవారు... జబ్బు నయమై పోయేది ! పరశురామ్ గారిది లవ్ మ్యారేజ్... ఆవిడ పేరు రామరాజ్యం గైనకాలజిస్ట్ 
గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తూ... భర్త పరశురామ్ హోస్పిరల్ కు కూడా వచ్చేది !
ఆయన నాజ్వరానికి నాలుగు రోజులు ట్రీట్ మెంట్ చేసినా తగ్గలేదు మరో రెండు రోజులు మందులు మార్చి చూసినా జ్వరం పెరిగిపోయిందే గానీ తగ్గలేదు...! అది యే  సెరిబ్ర నల్ మలేరియావో, వైరల్ ఫీవరో.. !ఆఖరికి... నార్ఫ్లాక్స్ 500. తో ట్రీట్మెంట్ ఇచ్చారు అప్పుడు తగ్గుముఖం పట్టి మరో నాలుగు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది !ఈరోజుల్లో ఐతే మాపార్వతీపురంలో... ప్రతి విభాగానికి ఒకరు, ఇద్దరు స్పెషలిష్టులు, ms.లు... గైనకాలజిష్టులు... చిల్డ్రన్ స్పెషలిష్టులు... Ent..లు 
డెంటల్ స్పెషలిష్టులు.... అన్ని అవసరాలకూ అన్నిరకాల వైద్య సదుపాయాలూ పార్వతీ పురం లో ఉన్నాయిప్పుడు !
తీర్ధ యాత్రలు, విహారయాత్రలు కూడా ఒకోమారు ఆనందాన్నిస్తే
పాపాలకు పనిష్  మెంటుల్లా  
ఔతుంటాయిఒకోసారి  ! నా పెళ్ళైన కొత్త లో... నేను, మాయావిడ అమ్మా నాన్నతో కలిసి ఓమారు అరసవిల్లి, శ్రీకూర్మాం, శ్రీముఖ లింగం వెళ్లాం... ఇంకోమారు నేను నాభార్య, మా అమ్మ, ఒరిస్సా జైపూర్ దగ్గర ఉన్న గుప్తేశ్వరం అనే శైవ క్షేత్రం వెళ్లాం అదొక అద్భుతమైన వాతావరణం లో అందమైన చిన్న కొండంత శివలింగం.. 
పెద్ద రాతిగుహలో ఉంది ... !
ఈ విహారయాత్రలన్నీ ఆనందా న్ని కలిగిస్తే...ఓ మారు నా కురుంబము, మాచిన్న చెల్లి
తన ఇద్దరు పిల్లలు... అంతాకలసి మాఊరినుండి పాసింజెర్ ట్రైన్ లో గంట ప్రయాణం రాయగడ... అక్కడి అమ్మవారు మంచి మహత్తు కలది... మేము ఇంచుమించు ప్రతిసంవత్సరమూ...దఫ దఫాలు గా...  తిరుపతి విజయవాడ, సింహాచలం, రాయగడవెళ్తుంటాం...ఆనందంగానే వెళ్లి రావటం జరిగేది గానీ  
ఈ సారి రాయగడా ట్రిప్ కొంత ఇబ్బంది పెట్టింది... నేను బయలు దేరేటప్పుడు ఐదు వందల నోటు, కొంత చిల్లరనోట్ల తో పాటు... Atm. కార్డు కూడా టికెట్పాకెట్లోఉంచి...కొన్నినోట్లు... టికెట్ లు ఖర్చులకోసం ప్రక్క జేబుల్లో పెట్టాను... మద్యాహ్నానికని మాచెల్లి పులిహోర, సేమియా తయారుచేసింది... ఫ్రూట్ లు, 
బిస్కెట్ లు కూడా పట్టుకున్నాం రాయగడా ట్రైన్ ఫుల్ రష్... !
ఆలయం దగ్గర ట్రైన్ చైన్ లాగి ఆపేస్తుంటారు ! ఆరోజు అలాగే ట్రైన్ ఆగింది అందరం గబ గబా దిగిపోయి ఆలయం వైపు నడుస్తున్నాం... వెనుక ట్రైన్ డోర్ దగ్గర నిలబడినాయన ఏయ్ ఏయ్... అని పిలుస్తుంటే వెనుతిరిగి చూసాను... !అతని ప్రక్కనున్న మరొకాయన ఏం లేదు ఎల్లండి అనేసరికి నేను ఆలయం వైపు వెళ్లిపోయాను !
ఆలయం దర్శనం అయిపో యింది అక్కడికికొంతదూరంలో 
తెరావలి అని మంచి విజిటింగ్ ప్లేసుందని... అదిచూడటానికి బస్సెక్కి వెళ్లిపోయాం... అక్కడ కూడా అంతా తిరిగి ఎంజాయ్ చేసి, పులిహోర, సేమియాతిని  ఇంక అక్కడినుండి ఆటో ఎక్కి మూడుమైళ్ళ దూరంలో ఉన్న స్టేషన్ కివెళదామని డబ్బులకోసం చూస్తే బయట జేబులు ఖాళీ... టికెట్ పాకెట్ లో ఉంచిన ఐదు వందలనోటు 
Atm.. కార్డుకోసం చూస్తే ఆ జేబు ఖాళీగానే ఉంది... అప్పుడు జ్ఞాపకం వచ్చింది !
ట్రైన్ దిగుతున్నప్పుడు అతను కేకేసింది... నాకార్డు, డబ్బులు పడిపోయాయనే... !చిన్నపిల్లలు,ఆడవాళ్లు...చేతిలో పైసా లేదు మండుటెండ !
పెద్ద పనిష్ మెంటయిపోయింది 
స్టేషన్ వరకూ... నడిచాం... స్టేషన్ లో... పంపు  నీళ్ళు వేడి గా ఉన్నా అవేతాగాం ! టిక్కెట్ల కు డబ్బులు లేవు.. అక్కడ మనకు తెలిసిన వారెవరుం టారు !?  టిక్కెట్లు లేకుండానే ప్రయాణానికి సిద్ధపడ్డాం తప్పదుకదా... ! ఐనా మనసు పీకుతోంది..., మమ్మల్ని ఓ ఇద్దరు వ్యక్తులు గమనిస్తున్నా రు ఎక్కడికి వెళ్ళాలి, ఏమిటి సంగతని అడిగితే... విషయం చెప్పాను !టిక్కెట్లు ఎంతైతే అంత తీసుకోండి అని ఒకతను డబ్బులిచ్చారు, అతను lic. ఏజెంటట... వైజాగ్ శ్రీహరిపురంలో ఉంటారట అడ్రెస్స్ తీసుకుని కృతఙ్ఞతలు చెప్పుకున్నాం... కష్టాలు పెట్టినా ఆసమయంలో ఆ దేవుడే ఆ వ్యక్తి రూపంలో వచ్చి సహాయం చేసాడని భావించాను ! పార్వతీపురం ఆరాత్రికి చేరుకొని... మరుసటి రోజు ఉదయాన్నే పిస్టాఫీసుకు వెళ్లి అతని డబ్బులు mo. చేసాను అక్కడ అతను పోస్టుమాన్ కి ఇవ్వవలసిన డబ్బులతో కలిపి... !దీని కంటే ఎన్నో ఇబ్బందులు, చికాకులు పెట్టిన మరో తీర్ధయాత్ర... 
ఇపుడు వద్దు....రేపు చెబుతాను..... !
       ******
  ......   సశేషం  ........

కామెంట్‌లు