దొంగ-సింహం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మన పంచతంత్రం కథలు లాగానే ఆఫ్రికన్ కథలుకూడా జంతువులతో కూడిన కథలు.ఒక పల్లెలో ఆయువతి భర్త కూలీపని కోసం విదేశానికి వెళ్లటంతో చిన్నారి కొడుకు తో ఒక్కత్తే ఉంటోంది. ఓఆవుని పెంచుతోంది. దాని పాలు అమ్మి బతుకు ఈడిస్తోంది.ఆపల్లెకి ఓదొంగవచ్చాడు.ఆఊళ్లో అంతా బీదబిక్కీ జనం!కొందరికి మాత్రమే కోళ్లు గొర్రెలు మేకలు ఉండేవి. ఈమె దగ్గర ఆవు ఉంది అన్న విషయం దొంగ పసిగట్టాడు.దాన్ని కాజేయాలనే తలంపుతో ఆచీకటిలో మాటువేశాడు.ఇంతలో అడవి నించి ఓ సింహం పిల్ల ఓరెండు ఏళ్లది ఆకలి ఉండి దారి తప్పి  అటుగా వచ్చింది. ఆవుకనపడటంతో దాని నోటి లో నీళ్లు ఊరాయి."అబ్బ!ఇంత పెద్ద ప్రాణిని రెండు రోజులు తినొచ్చు"అని లొట్టలేస్తూ బాగా చీకటిలో  కూచుని ఉంది. అక్కడే దొంగకూడా ఉన్నాడు.గుడిసెలన్నీ బాగా దగ్గరగా ఉంటాయి కాబట్టి త్వరగా పారిపోలేదు.ఆఇంటిలో పిల్లాడు తెగ ఏడుస్తూ  తల్లి ని  సతాయిస్తుంటే ఆమె భయపెడుతోంది"అరె అలా ఏడిచావంటే నిన్ను సింహం పిల్ల ఎత్తుకుపోతుంది."కానీ వాడు  అలా ఏడుస్తూ ఉంటే  గీ!బా!అని శోకాలు పెడుతుంటే విసుగ్గా తల్లి అరిచింది "సరే ఉండు.నీకు  కోకమ్ ఇస్తాను "ఆనటం ఆలస్యం వాడు ఠక్కున ఏడ్పు ఆపేశాడు.సింహం పిల్ల ఆమాటలు జాగ్రత్తగా వింది.దాని మనసులో గుబులు మొదలైంది. " పిల్లాడు సింహం ఎత్తుకెళ్ళుతుంది  అంటే భయపడలేదు.కానీ కోకమ్ అన్న పదం వినగానే గప్ చిప్ ఐనాడు.అది ఏదో పెద్ద జంతువు కాబోలు! ఆకోకమ్ నన్ను చంపేయడం ఖాయం "అని ఠారెత్తి పారిపోతుండగా  దాని వీపుపై ఏదో భారీవస్తువు పడింది."బాబోయ్!ఆకోకమ్ నావీపు ఎక్కింది.దేవుడా ఎలా?" అని పరుగు అందుకుంది. కానీ నిజానికి జరిగింది ఏమంటే దొంగ అడుగులు వేస్తూ కదులుతున్న సింహం ని చూసి  ఆచీకటిలో  అది ఆవు అని భ్రమపడి చేతిలోని తాడుతో దానిమెడను గట్టిగా కట్టాడు."ఓరినాయనోయ్!ఆకోకమ్ జంతువు తనకాళ్లతో  నామెడను నొక్కి  తాడుతో బంధించింది."అని భయం తో పరుగెత్తి  అలసిపోయి ఓచెట్టు కింద ఆగింది. పైనున్న దొంగ  తాడుని చెట్టుకి కట్టేసి  తను చెట్టుపైకెక్కి నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారగానే వాడు చెట్టుకి కట్టి ఉన్న  సింహం ని చూసి "అరె!ఇదిఆవుకాదు.సింహం పిల్ల "అని తన గూడెం వైపు పరుగులు పెట్టాడు. ఆఊరివారు పొలం పనులకు వెళ్లు తూ మగతగా నిస్స త్తువుగా ఉన్న  సింహం ని బోనులో పెట్టి  తమ గూడెం పెద్ద వద్దకు తీసుకుని వెళ్లారు.అతను దాన్ని  ఓసర్కస్ కంపెనీ కి అమ్మేశాడు.భ్రాంతి అనేది ఎంత పనిచేయిస్తుందో చూశారుగా!🌹
కామెంట్‌లు