"కంచెను కట్టకుంటే ఎలా...!!"కోరాడ నరసింహా రావు
లేలేత మొక్కలుగా ఉన్నపుడే 
తగురీతిలో ఒంచి పెంచాలి గా 

అడ్డదిడ్డంగా పెరిగిన తరువాత 
అపసవ్యాలను సవరించ లేక 
నరుక్కోవలసివస్తే..బాధాకరమే.
అందాల సుఖమయ జీవిత భవంతికి... సంస్కారమే గా... 
పునాది...!తల్లి, తండ్రి, గురువు లు, స్నేహితులు... వీళ్లే నోయ్ 
ఆ భవంతికి పిల్లర్లు... !!

కధలు, కబుర్లు, పాటలతో... 
మంచిని బోధిస్తూ తల్లి..., 
క్రమశిక్షణ గల నడవడితో తండ్రి...., విచక్షణ, వివేకాలను నేర్పుతూ గురువు...సదాలోచ 
నల స్నేహితులు... దొరికితే... 
ఇంక ఆ జీవితాలు ఆనంద హర్మ్యాలే గా.... !

 తల్లిదండ్రులైనా, గురువులైనా 
పిల్లల పొరపాట్లవి ఎన్నైనా... 
క్షమించి  బోధపరచాల్సిందే !
అదే  అశ్రద్దయితే, నిర్లక్ష్యమైతే 
తగురీతిలోదండించితీరాల్సిందే

విద్యాబోధనకు కీలకమైనది  
బాల్యావస్థ !మంచి, మానవ త్వం... నీతి, న్యాయం అనేవి 
నేర్పకపోతే... ఆ పిల్లలు పల్లే రు కంపల్లా కాక... మంచి మామిడి చెట్లలా ఎలాతయారు  కాగలు గు తారు... !?

మంచి ఫలాలనిచ్చే మామిడి చెట్టును ఆసిస్తూ.. ఆ మొక్కకు సరైన కంచెను కట్టకపోతే... 
చుట్టూ తిరిగే పశువులు మేసే యవూ.... ?!
       *******
    ....... కోరాడ.

కామెంట్‌లు