డేగల్లే ఉండాలి; -- జగదీశ్ యామిజాల
డేగను గొడవకు లాగేది 
ఒక్క కాకి మాత్రమే. 
మిగతా పక్షులు డేగకు దూరంగానే ఉంటాయి. 
కానీ కాకి ఎంత రెచ్చగొట్టినా 
డేగ పట్టించుకోదు. 
తన మానాన తాను ఎగురుతూ 
పైపైకి పోతుంటుంది. 
అయితే అంతంత ఎత్తుకి పోలేక కాకి కిందకు వచ్చేస్తుంది.

అలాగే మనల్ని 
హేళన చేసే వారి మాటలను పట్టించుకోకుండా 
అనుకున్న లక్ష్యసాధనలో 
మున్ముందుకు పోతుండాలి. 
అప్పుడు హేళన చేసే వారు
ఏమీ చేయలేక చెదరిపోతారు.


కామెంట్‌లు