చుక్కల రథం(బాల గేయం);-ఎడ్ల లక్ష్మి
చూడు చూడు చుక్కమ్మ
చుక్కల రథం ఎక్కమ్మ
రెక్కలు విప్పి లేస్తుంది
చక్కగ తిరిగి వస్తుంది

సంద్రమేము దాటుతుంది
ఇంద్రలోకంలో ఆగుతుంది
చంద్రమండలం చేరుతుంది
ఇంద్రధనస్సు చూపుతుంది

మీల మీలా మెరుస్తుంది
చుక్కల్లో తేలుతుంది
ట్రిక్కు లెన్నో చేస్తుంది
మబ్బు ల్లోన దాగుతుంది

లోకమంత తిప్పుతుంది
లెక్కలెన్నో నేర్పుతుంది
చక్కనైన ఆ చుక్కల రథం
సూర్యుని వద్దకు చేరుస్తుంది


కామెంట్‌లు