కశ్యపుని సంతతి.పురాణ బేతాళకథ.;-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 పట్టువదలని విక్రమార్కుడు శవంలోని బేతాళుని బంధించి భుజంపైన వేసుకుని మౌనంగా బయలుదేరాడు.
శవంలోని బేతాళుడు 'మహారాజా పద్మము,మహాపద్మము,శంఖము,మఖరము,కచ్చపము,ముకుందము,నీలము,కుందము,వరము అనే నవ నిథులు కలిగిన నీవు గొప్పవాడివే! నాకు చాలాకాలంగా కస్యప మహర్షి సంతతిగురించి తెలుసుకోవాలని ఉంది తెలిసీ నీవు చెప్పకపోయావో మరణిస్తావు ' అన్నాడు బేతాళుడు.
బేతాళా అదితి కస్యపులకు విశ్వవంతుడు,ఆర్యముడు ,పూషుడు , త్వష్ట,సవిత ,భగుడు,దాత, విధాత,వరుణుడు, మిత్రుడు,ఇంద్రుడు , వామనుడు అనే పన్నెండుమంది ఆదితిత్యులు జన్మించారు.
సూర్యుడు సంధ్యాదేవిలకు శ్రధ్ధాదేవుడు అనేమనువు,యముడు,యామి అనేకవలలు,అశ్వరూపంలోఉండగా అశ్వనిదేవతలుజన్మించారు. సూర్యునికి ఛాయదేవి అనే మరోభార్యఉంది. ఆమెకు శనైశ్చరుడు,సావర్ణి అనేమనువు,తపతి అనే కుమార్తెకలిగారు.తపతిని సంవరుణుడు వివాహం చేసుకోగావారికి కురువు ఐజన్మించాడు.ఇతనేకురు,పాండవులకు మూల పురుషుడు.
ఆర్యమునికి మాత్రుక అనేభార్యవలన చర్షణులు జన్మించారు.పూషుడు సంతాన హీనుడు.త్వష్ట దైత్యుల చెల్లెలైన రచన అనేకన్యను వివాహం చేసుకోగా వారికి విశ్వరూపుడు జన్మించాడు.సవిత పృశ్ని దంపతులకు సావిత్రి,వ్యాహృతి,త్రయ అనే పుత్రికలు,అగ్నిహాత్రము ,పశుయాగము, సోమయాగము,పంచమనోయజ్ఞాలు అనేపుత్రులు జన్మించారు.
భగువు సిధ్ధకి దంపతులకు మహిముడు,విభుడు,ప్రభుడు అనేపుత్రులు, ఆశీష అనేకుమార్తే జన్మించారు.ధాతకు కుహువు,సినివాలి,రాక, అనుమతి అనే నలుగురు భార్యలు.వీరిలో కుహువుకు సాయంకాలం సినివాలికి ధర్ముడు.రాకకు ప్రాతఃకాలము. అనుమతికి పూర్ణామాఖ్యుడైన పుత్రులు కలిగారు.
విధాత క్రియదంపతులకు పురీష్యాదులైన అగ్నులు జన్మించారు.
వరుణుడు చర్షిణి దంపతులకు ఉత్సర్గుడు,అరిష్టుడు,పిప్పలుడు జన్మించారు.ఉర్వసి మిత్రవరేణ్యులకు అగస్త్యుడు,వసిష్టుడు జన్మించారు. ఇంద్రుడు శుచిదేవి దంపతులకు జయంతుడు,బుషబుడు,విధుషుడు అనేపుత్రులు జన్మించారు.వామనుడు కీర్తి దంపతులకు బృహుత్శ్లోకుడు, అతనికి సౌభగుడు జన్మించాడు.
దితి కస్యపులకు హిరణ్యకసిపుడు,హిరణ్యాక్షులు అనేఇరువురు పుత్రులు కలిగారు.హిరణ్యాక్షుడు జంభాసురుని కుమార్తె లీలావతిని వివాహంచేసు కోగా వారికి ప్రహ్లదుడు,అనుహ్లదుడు, సంహ్లదుడు,అనే పుత్రులతోపాటు, సింహక అనే పుత్రిక జన్మించింది.ఈమె విప్రచిత్తి అనేదానవుని వివాహం చేసుకుంది.వీరికి రాహువు,కేతువులు జన్మించారు. రాహువు కుమారుడు మేఘహొసుడు.సంహ్లదునిభార్య గతి వీరికి పంచజనుడు,జన్మించాడు.హ్లాదునిభార్య దమని వీరికి వాతాపి, ఇల్వలుడుఅనేవారు జన్మించారు.(వీరు అగస్యునిచే సంహారింపబడ్డారు ) అనుహ్లాదునిభార్య పేరు సూర్మ్య వీరికి భాష్కలుడు,మహిషుడు జన్మించారు.ప్రహ్లాదుని భార్యపేరు దేవి వీరికి విరోచనుడు అతనికుమారుడు బలి చక్రవర్తి.ఇతనిభార్య ఆశన వీరికి బాణాసురుడు వంటి పలువురు జన్మించారు ' అన్నాడు విక్రమార్కుడు .
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు