మానవత్వం;-పద్మావతి. పి;-కలం స్నేహం
మదిలో దాగిన అనుబంధం
మౌనంగా సాగిన ఆత్మీయం
అనురాగానికి అపురూపం
ఎవరికీ దక్కని ఆనందం..

అంతస్తులు మరిచిన అనురాగం
కొందరి మనసులకే అది సొంతం
తోడు నీడై అందించిన సహకారం
కులమూ జాతీ తేడాలే లేని అంతరంగం..

మనసులు కలిసిన 
తీయని బంధం
పవిత్ర ప్రేమకు నిర్వచనం
సమసమాజ సిద్ధాంతానికి చైతన్యం
మానవ ప్రేమకు ఆదర్శం..


నేలా నీరూ నింగీ అందరికీ ఆశ్రయం
శశి చంద్రుని చల్లని వెన్నెలలూ స్వచ్ఛమే
ప్రతి ఉషోదయం ప్రేమకి ప్రతిరూపం..
రాజూ పేదా అంతరాలే మరిచిన స్నేహం
రాగం ద్వేషాహంకారమే తెలియని అభిమానం
శ్రమ శక్తుల విలువలనే ఎరిగిన మైత్రీ బంధం..

మానవత్వమే ప్రతి మదిలో నిండగా
శాంతీ మైత్రీ స్వేచ్ఛా నిండిన 
భావనలు ప్రేమల సుగంధాలను
వెదజల్లే పూపొదరిళ్ళు
అంతటా విశ్వ కళ్యాణమే రాజిల్లదా!
శోభా సౌభాగ్యాలు ప్రాప్తించవా!
ఇదియే మనిషికి మనిషికి సంబంధం
ఆత్మీయతకే ఆలింగనం..


కామెంట్‌లు