ప్రేమకు ప్రతిరూపం;-భారతి పెద్దపల్లి;-కలం స్నేహం
 ఆమె//
నీ ఊపిరే నాకు ప్రాణమై....
నీ చూపులే నాకు ధ్యానమై....
నిన్ను వీడి ఉండలేక రాస్తున్న
ఓ ప్రేమలేఖ
ఓ... ప్రియతమా  అందుకో
నా శుభ లేఖ... 
నీకై వేచేను నా మనసంత..... 
నిన్ను తలిస్తేనే నాకు గిలిగింత....
వీణ నీవై తీగ నేనై కలిచిందిలే.....
మనిద్దరి కలయిక సాగేనులే...
అతను//
ప్రేమంటే నువ్వేనని తెలుసుగా....
ఓ...పంచవన్నెల చిలుకమ్మా.....
మదిలో నిలిచిన నా ప్రేమిక వై....
నిన్ను వీడి నేను ఉండలేనే
నా చెంతకు చేరా రావే  ఓ.. నాచెలి....
 ఆమె//
ప్రేమకు  ప్రతిరూపం నీవేనని.....
నువ్వు పరిచయమైనాక తెలిచేనులే...
నువ్వే నాప్రియతమవని... 
కొత్త కొత్త ఆశలన్ని నీచుట్టూ చేరేలే....
ఎన్ని రోజులైనా నీకోసం వేచి ఉంటానులే
నీ ప్రక్కన నేనుంటే అదే నాకు స్వర్గమాయేనే..
అతను//
మనం కలిసిన మధుర క్షణాలు..... 
మరుపు రాక  నెమరు వేస్తి....
నువ్వు చెప్పినతీపి కబుర్లెన్నో
మరువలేక పోతున్నా..
నీ చిరునవ్వులు చిగురించేనే....  
మనసు విప్పి మాట్లాడుదాం
మనకు మంచి రోజు వచ్చింది....
ఇక  మనువాడుకుందాం....
మనిద్దరి బంధం ఏడడుగుల 
సంబంధమై సాగాలి కలకాలం....

కామెంట్‌లు