సంతోషాల చంద్రశాలలు.;-అనురాధ మేరుగు;-కలంస్నేహం
కన్నులు కావవి మదినగుచ్చే తీపి బాణాలు...
బాకుల బాణాలు కానే కావవి చురకత్తుల చూపులు...
వయసు పొలానికి ప్రేమ జలములొసగి...
జలతరంగిణిలో ఓలలాడే మధుర యవ్వనప్రాయాలు...
నీ తనువులో వాయువై లీనమైన అధరామృత మధురనాదాలు...

ఆశ్చర్యాల ముంచే వగరుప్రాయాలు సంతోషాల చంద్రశాలలు...
పాలపుంతలో తేనె ముంతలైన ప్రియుని తలచే ముద్దుగుమ్మల ముచ్చట్లు... 
ఆనందాల డోలలూగి ఊరించే ఊహల ఊగిసలాటలు...

ఆలింగనాల సమీకరణాలు పోగేసి...
స్వప్నాల శాంతి స్వర్గాలనేలాలని ....
 కళ్ళల్లో కోటి కాంతులు చేర్చి వెతికే విరహాల మహా నివేదనలు...
నీతో సాయంత్రపు సరదాలు చేయకపోతే వయసు ఆగేనా...?
తీగ లేక వీణ పలుకునా...? తీయని రాగం ఆలపించునా...?

మనసులో మమతల మతాబుల రవ్వలు రగిల్చి...
మధురాతి మధురంగా గుప్పెడు గుండెలో
 గుబాళించే గులాబీలు 
 పూయించి...
హృదయ వీధిన ప్రేమ రసాల శోభపల్లవ పంకజాలను చిగురింపజేసిన నా స్వామీ నీకు....
పరువపు పద్యాల మాల వేయనా...
 కరుణతో కావ్య రచన గావించనా....యన్న సందోహాల హిందోళమైంది నా మది...


కామెంట్‌లు