వర్క్ ఫ్రొం హోమ్; కె. వెంకట రమణ రావు

 కరోనా మహమ్మారితో  వర్క్ ఫ్రొం హోమ్  అని చెప్పి, కొడుకు కోడలు మా ఇంటికి వచ్చేసారు.  వచ్చిన వారం  రోజులు ఐసోలేషన్  అంటూ ఉన్న రెండు బెడ్ రూమ్ ల్లో దూరిపోయి తలుపులు బిగించుకుని ఉండిపోయారు. టిఫిన్లు కాఫీలు భోజనాలు అన్నీ  రూమ్ లో కి తీసుకెళ్లి అక్కడే కానిచ్చేవారు, 
  మా ఆవిడా ఇంకా ఉద్యోగం చేస్తోంది.  వారానికి మూడు రోజులు ఇంట్లో , మూడు రోజులు ఆఫీస్ కి వెళ్తుంది. ఉదయానే లేచి అందరికీ కావలసినవి వండి పెట్టి ఆఫీస్ కి వెళ్ళేది. కరోనా అని పని మనిషి కూడా మానేసింది. ఇవేవి పిల్లలకి పట్టడం లేదు. ఇంకా ఎదో చిన్న పిల్లల లాగ బాధ్యత లేకుండా లాప్ టాప్ కి వాట్సాప్ పేస్ బుక్ కి అతుక్కుపోయారు. అందరికీ అన్నీ సమయానికి అందాలి , పని చెయ్యడానికి ఎవరూ ముందుకు రారు.
ఈ వర్క్ ఫ్రొం హోమ్ ఇలాగే  ఉంటె పరిస్థితి  చెయ్యి జారడం ఖాయం. వీళ్ళ మనసులని నొప్పించకుండా ఎలా బయటపడాలా  అని ఆలోచించాము.
ప్రొద్దున్నీ కాఫీ కోసం గదుల్లోంచి  వచ్చిన వాళ్ళకి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న కాగితము  కనిపించింది. 
తాతగారికి సీరియస్ గా ఉంది.  నేను నాన్న తెల్లవారుజామునే  వూరు వెళ్తున్నాము.  ఒకవేళ మీరు మీ ఇంటికి వెళ్లాలంటే తాళాలు ఎదురింటి వాళ్ళకి ఇవ్వండి.  -అమ్మ. 
 ఆ కాగితం చూసి అబ్బా ఇదేంటి వీళ్ళు ఇలా వెళ్లిపోయారు , అంటూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు . 
కామెంట్‌లు