గోదామృత గజల్;-సోంపాక సీత భద్రాచలం
కరువుకోర విరిగెనహో.. చూసినారు సమృద్ధిని
ముప్పంటలు పండెనహో.. పొందినారు సమృద్ధిని

పాలధార,వర్షధారలు.. కురియుచున్న శుభకాలం
బహునిష్టతో జనులంతా.. తాకినారు సమృద్ధిని

పుడమితల్లి,గోమాతలు.. రేపల్లెకు హారమాయె
చతుర్విధాల ఆర్తజనులు.. ఎరిగినారు సమృద్ధిని

మూడడుగుల ఆ దానము.. మూర్తిచెంత మోకరిల్లె
నిజతత్వము మదినిలుపుచు.. కొలిచినారు సమృద్ధిని..

ప్రాణికోటి మత్తిల్లెను.. పరిసరాలు నర్తించగా
సిరి'సీతా' జగమంతా.. గెలిచినారు సమృద్ధిని

                    

కామెంట్‌లు