ప్రసాదం-పరమార్ధం.పురాణ బేతాళకథ .;-డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.

 పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజంపై వేసుకుని మౌనంగా బయలు దేరాడు.
శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు'మహీపాలా  మన దేవాలయాలలో నేతి,ఆవ నూనె,నువ్వుల నూనె,కొబ్బరి నూనె,ఆముదము,వావిలి నూనె,ఇప్ప నూనె,కుసమ నూనె,అవిశి నూనె,ధయాల నూనె,కానుగ నూనె,ఇంగుదీ నూనె,నిమ్మ నూనె,జోతిష్మతీ నూనె,కరక నూనె,కోశామ్ర నూనె,కర్పుర తైలం,తానికాయ నూనె,ములుదోస నూనెవంటి నూనెలతో దీపారాజనల అనంతరం  పలు రకాల ప్రసాదాలు ఇస్తుంటారు అసలు ప్రసాదం పరమార్ధం ఏమిటి? సకల వేదాలు,ఉపనిషత్తులు చదివిన నీవు  చెపితే తెలుసుకోవాలి అనుకుంటున్నాను తెలిసి చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు.మన ప్రయాణంలో అలసట తెలియకుండా ఉంటుంది.అన్నాడు.
'బేతాళా మన పూర్వీకులు చేసిన ప్రతి పనిలో నిగుఢార్ధం దాగిఉంది. అన్నం పరబ్రహ్మస్వరూపం అని శృతులు చెపుతున్నాయి.ప్రాణంకాపాడేది అన్నంకనుక,అన్నాన్నిప్రసాదంగాచూడమని ఆదిత్యపురాణంచెపుతుంది.
               "పూజితం హ్వశనం నిత్యం బలమూర్జంచ యచ్ఛతి"
పవిత్రజలంతో పరిశుభ్రంగా పవిత్రభావంతో వండిన అన్నం పరబ్రహ్మ స్వరూపంఅవుతుంది. పదిమందికి పంచగా మిగిలిన శేషాన్ని 'అన్నయజ్ఞం'తరువాత భుజింపమని విజ్ఞులు చెపుతారు.దానాల్లోకెల్లా 'అన్నదానం'గొప్పదని పెద్దలు చెపుతారు.
                 'అన్నాన సదృశం దానం నభూతో నభవిష్యతి'
శుధ్ధము,సిద్ధము,ప్రసిధ్ధము అని ప్రసాదాన్ని లాక్షణికులు మూడు విధాలుగా పేర్కొన్నారు.గురుభుక్తశేషాన్ని'శుధ్ధము' దైవభుక్త శేషాన్ని'సిద్ధము' భగవత్ భక్తులు భుజింపగా మిగిలిన శేషాన్ని 'ప్రశిధ్ధమని'పెద్దలు అన్నారు.అందుకే' అన్నబ్రహ్మ తత్వరాధనకు' భారతీయసంస్కృతి పెద్దపీటవేస్తాయి.
అన్నంబ్రహ్మ"అహంచబ్రహ్మ"భోక్తాంచబ్రహ్మ"అన్నారు పెద్దలు. ప్రసాదమంటే ప్రసన్నత,తేటదనము,నైర్మల్యము, ఈప్రసాదం పంచకుండా తింటే విషతుల్యం అంటారు.
'అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే'
జ్ఞానవైరాగ్య సిధ్యార్థం బిక్షాందేహిచపార్వతీ'
అన్నం నైవేద్యరూపంలో ఒక విశిష్ఠత పరమార్ధంగా గోచరిస్తుంది. అన్నంనిండి నిబిడీకృతమైన శక్తి పాలతో కలసినపుడు, దీనికి తీపిపదార్ధంకలిపితే,ద్విగుణీకృతమౌతుంది.రెట్టింపై 'చక్కెరపొంగలిగా' మారుతుంది.దానికి పెసరపప్పు,కొబ్బరిముక్కలు కలిస్తే వచ్చే పోషకవిలువలు అపారం.అలా నివేదన చేయబడిన 'పిడికెడు'నైవేద్యం ఒ అభాగ్యుని అర్ధఆకలిని తీర్చగలుగుతుంది.అలాగే 'పులిహార''పొంగలి' 'దద్దోజనం'వంటి ప్రసాదాలలో అన్నంకంటే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కనుకనే వాటిని భగతార్పణం చేసి భుక్తశేషాన్ని మాత్రమే అమృతంగా భావించి స్వీకరించాలి.అందుకే 'ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి,త్రిభుక్తంమహారోగి అన్నారు.
ఆకలితొఉన్నవారికి రుచితెలియదుఅని'క్షుథాతురాణంనరుచిఃనచకాలమ్ .ఆకలిగా ఉన్నప్పుడు దొరికిన ఆహారం అమృతతుల్యం. మనిషి  మరణించవచ్చుగాని,దానశీలిమరణానంతరము చిరంజీవే. అన్నిదానల వలన మనిషి మహనీయుడిగా గుర్తింపబడతాడు.ఈ ఈశ్వరార్పణ భావనకి సత్త్యశుధ్ధికలుగుతుంది.అప్పుడే చిత్తశుధ్ధి,జ్ఞానం, జాలి, దయా,కరుణభావాలు ఏర్పడతాయి.ఈలక్షణాలు కలిగిన మనిషి ఇలలో మహాన్నతుడిగా కొనియాడబడతాడు'అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు