నహుషుడు. పురాణ బేతాళకథ .;-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజంపైనవేసుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహారాజా పార్ధవ,కూర్మ,వరాహ, బ్రహ్మవరాహ,శ్వేతవరాహ,సావిత్రి,ప్రళయ లైన సప్తకల్పాల చెరిత్రతెలిసిన నీవు అభినందనీయుడవు. నాకు చంద్రవంశంలో జన్మించిన నహుషునిగురించి తెలుసుకోవాలనిఉంది. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు ' అన్నాడు.
 ' బేతాళాచంద్రవంశంలోబుధుడుఇలదంపతులకు,పురూరవుడు,
జన్మించాడు అతనిభార్య ఊర్వశి.వీరికి ఆయువు జన్మించాడు, అతనిభార్యస్వర్బాన. వీరిపుత్రుడు 'నహుషుడు ఇతనిభార్య ప్రియంవద,వీరికి యతి,యయాతి, సంయుక్తి,అయూతి,ఉద్దవుడు అనేఐదుగురుకుమారులు. 'విశ్వరూపుడు' అనే పండితుడైన బ్రాహ్మణుడు రాక్షసలక్షణాలు కలిగిఉండటంచేత అతన్ని ఇంద్రుడు సంహరించాడు, బ్రహ్మణ హత్యాపాతకం నివారణకై ఇంద్రుడు స్వర్గం వదలి చాలాకాలం పుణ్యతీర్దాల స్నానాలు చేస్తూ భూలోకంలో ఉండిపోయాడు.ఇంద్రపదవి ఎవరైనా ఉండాలికనుక అర్హుడైన నహుషుని తీసుకు వెళ్లిన సప్తరుషులు ఇంద్రపదవి అప్పగించారు.ఇంద్రసింహాసనం అధిష్టించిన నహుషుడు దుర్బుధ్ధితో ఇంద్రపదవితో పాటు ఇంద్రునిభార్య 'శచిదేవి'కూడా తనకు చెందాలని అప్పుడే ఇంద్రపదవికి సంపూర్ణత అన్నాడు.శచీదేవి దేవతల గురువైన 'బృహస్పతికి విషయం విన్నవించింది. అదివిన్న బృహస్పతి సప్తరుషులు నహుషుని పల్లకీలో మోసుకువస్తే,అతనికోరికతీరుతుందని నహుషునికి తెలియజేసాడు. మరుదినం నహుషుడు సప్తరుషులను పిలిపించి 'ఇంద్రపదవిలో ఉన్ననేను ఆజ్ఞాపిస్తున్నాను,నన్నుపల్లకీలో మీరుమోసుకుంటూ శచీదేవి మందిరానికి తీసుకువెళ్లండి 'అన్నాడు.ఇంద్రపదవిని గౌరవించిన సప్తరుషులు నహుషుని పల్లకిలో ఎక్కించుకుని మోసుకుంటూ బయలుదేరారు.అందరిలో ముందు ఉన్న అగస్త్యమహర్షి పొట్టిగా ఉండటంవలన పల్లకి మోయలేక నెమ్మదిగానడవసాగారు.అదిగమనించిన నహుషుడు చేతికర్రతో అగస్త్యు తడుతూ'సర్ప సర్ప'అన్నాడు (వేగంఅనిఅర్ధం) అప్పుడు అగస్త్యుడు కోపంతో 'నేటితో నీపుణ్యం అయిపోయింది. సర్పమై భూలోకంలో పడిఉండు'అనిశపించాడు.
నహుషుడు  అగస్త్యున్ని క్షమించమని కోరగా ఎవరయితే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆనాడే నీకు శాపవిముక్తి అని చెబుతారు. ఆనాటి నుండి నహుషుడు సర్పరూపంలో ద్వైతవనంలో తిరుగుతున్నాడు.
పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతాన్ని దాటి ద్వైతవనంలో ప్రవేశిస్తారు. అక్కడ సంచరిస్తున్న భీమున్ని నహుషుడు తన తోకతో బంధిస్తాడు. తమ్మున్ని వెతుక్కుంటూ ధర్మరాజు అది చూచి ఆశ్చర్యపోతాడు. అతన్ని వదిలిపెట్టమని కోరిన ధర్మరాజుని ప్రశ్నలకు సమాధానం చెబితే విడిచిపెడతానంటాడు. అతని ప్రశ్నలన్నింటికి సరైన సమాధానాలిచ్చిన ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసి శాపవిముక్తుడౌతాడు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా మాయమై చెట్టుపైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు