గీతాంజలి ; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 58." జీవ, మృత్యుహేల"
విశ్వకల్యాణానంద రాగాలన్నీ, నా కట్టకడపటి గీతంలో కరిగి మాధుర్యం కావాలి. పచ్చదనంతో పృధివిని ప్రాణప్రదం చేసే ఆనందం కవలలైన జీవన మృత్యువుల ప్రపంచాలింగన హేలానందం
ప్రాణికోటిని నవ్వుల డోలల్లో ఊపి, మేలుకొలుపు పాడి , కబంధహేలలో ఇముడ్చుకునే ఆనందం, విచ్చుకున్న అరుణ కమలంపైన కన్నీటి బిందువుల మెరుపులను రాల్చే ఆనందం, తనదైన దాన్నంతా దుమ్ములో విరజిమ్మి మౌనముద్ర కుపక్రమించే ఆనందం.
     
కామెంట్‌లు