* ప్రముఖ కవయిత్రి కాసర్ల లక్ష్మి సరోజతో నెల్లుట్ల సునీత ముఖాముఖి *
 మన సాహితి బృందావన జాతీయ వేదిక ఆత్మీయ  సభ్యులకోసం మీ గురించి నాలుగు మాటలు... 
మీ మాటల్లో .. 
ప్రశ్న....
~~~
పేరు, తల్లిదండ్రులు, స్వస్థలం, కుటుంబ నేపద్యం ఇతర వివరాలు 
జవాబు....
~~~
పేరు ••• కాసర లక్ష్మీ సరోజా రెడ్డి...పుట్టింది తెలంగాణా      లోని ఖమ్మం జిల్లా కందుకూరులో...నాన్న పేరు....బండి రామిరెడ్డి....అమ్మ....వీరవెంకమ్మ....ఇద్దరు తమ్ముళ్లు...బండి వెంకట రెడ్డి, బండి లక్ష్మారెడ్డి...మాది ఎగువ మధ్య తరగతి కుటుంబం.... ముగ్గురినీ ఉన్నత చదువులు చదివించారు.
ప్రశ్న....
~~~
* మీ విద్యాబ్యాసం ఎక్కడ జరిగింది.
ఎలా సాగింది. 
జవాబు....
~~~
   పదవతరగతి వరకు మా ఊరి పాఠశాలలోనే చదివాను.చదువులో ఎప్పుడూ నేనే ఫస్ట్. ఆరోజుల్లో
   పదవతరగతి లో 450 మార్కులు తెచ్చుకుని(1977)
   మెరిట్ స్కాలర్షిప్ సాధించుకున్నాను.
   ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ సత్తుపల్లి లో చదివాను.
   ఆ తర్వాత వివాహం... జంగారెడ్డిగూడెం రావడం.
   తదుపరి చదువంతా ఆంధ్రాలో సాగింది.
   B.Sc.,M.Ed.,B.L.,M.A(English).,M.A(Hindi)
   M.A(History).,M.A(R.D).,PGDFDR (Nalsar University).,M.Sc(Chemistry)
ప్రశ్న....
~~
మీ బాల్య స్మృతులు నెమరు వేస్తారా? 
జవాబు...
~~
* పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. ఇంటి వాతావరణం చాలా అనుకూలంగా ఉండేది. చాలా అందమైన బాల్యమనే చెప్పుకోవచ్చు.
ప్రశ్న...
~~
* మీ వృత్తి  ఏమిటి ..  ప్రస్తుతం ఏమి చేస్తున్నారు?
జవాబు...
~~~
* ""ప్రతిభ""అనే పేరుతో 1995 లో ఒక పాఠశాలను స్థాపించి ప్రిన్సిపాల్ గా ఉన్నాను.ఈరోజు చాలా పేరు ప్రఖ్యాతులతో నడుస్తూ ఎందరో ఉన్నత విద్యావంతులు తయారవుతున్నారు.
ప్రశ్న...
~~
కుటుంబం అంటే ఎలా ఉండాలి....
జవాబు....
~~~
కుటుంబం అనేది ఆప్యాయతలు పెనవేసుకున్న మమతల పందిరి కావాలి.
ప్రశ్న....
~~
* మీ ప్రవృత్తి ఏంటి? 
జవాబు....
~~~
* వృత్తి ప్రవృత్తి అన్నీ పాఠశాలేనేమో...మొక్కలు పిల్లలు చాలా ఇష్టం.
ప్రశ్న....
~~~
 * మీ అభిరుచులు ఏంటి ? 
జవాబు...
~~
 * చదవడం....రాయడం....మొక్కలు పెంచడం
ప్రశ్న...
~~
* మీరు ఎన్నుకొన్న  వృత్తి, ప్రవృత్తి ఇప్పుడు ఎలా ఉంది. 
జవాబు...
~~~
* చాలా సంతృప్తిగా ఉంది
ప్రశ్న ...
~~~
* మీరు వృత్తిలో ప్రవృత్తిలో ఏలా ప్రవేశించారు? ఎప్పటి నుంచి ఎన్ని కొనసాగుతున్నారు? 
జవాబు...
~~~
* పిల్లల్ని తీర్చిదిద్ది ఏదో మార్పు తేవాలన్న ఆకాంక్ష తో ప్రవేశించాను..అలాగే కొనసాగిస్తున్నాను
ప్రశ్న....
~~~
* మీ వృత్తి, ప్రవృత్తిలో అనుభవాలు ఏమిటీ ? 
జవాబు...
~~~
* ఉన్నత స్థానాల్లో ఉన్న విద్యార్థులను చూడడం కంటే ఆనందం ఏముంటుంది...? అంతేకాకుండా కుటుంబంలో వచ్చే పొరపొచ్చాలను సరిచేస్తూ మంచి తల్లిదండ్రులుగా కౌన్సిలింగ్ ఇచ్చి మారుస్తున్నాను.ఎందుకంటే కుటుంబ వ్యవస్థ కుంటుబడితే జాతి నిర్వీర్యమవుతుంది.
ప్రశ్న....
~~
*మీరు జీవితంలో చేదు అనుభవాలు వున్నాయా?
జవాబు....
~~~
*అందరిలానే నాకూ ఉన్నాయి.. 
ప్రశ్న...
~~~
* ఎలాంటివి చవి చూశారు? 
జవాబు
~~
* మాకు ఒక బాబు."బిట్స్ పిలానీ"లో చదువుకుని
* తన జ్ఞానమంతా పాఠశాలకే ఉపయోగిస్తున్నాడు.
* అది చాలా సంతోషం. కాని తర్వాత బాబు పోవడం
* చేదు అనుభవం.
ప్రశ్న...
~~~
*మీ అంతరంగం లో మెదిలిన సందేశాలు, సలహాలు ఏమిటి..
జవాబు..
~~
ఈ సమాజంలోని అసమానతలను ఇష్టపడను.సమసమాజం రావాలనే అభిలాష.
ప్రశ్న....
~~
* మీరు ఈ సమాజంలో అనేక రకాల మనుషులు  వుంటారు కదా!. 
వారి మనస్తత్వంలను మీరెప్పుడయినా గమనించారా? 
జవాబు..
~~~
అవును. రకరకాల మనస్తత్వాలు...స్వార్థపు ముసుగులో ఎందరెందరో....!
ప్రశ్న...
~~
* వ్యక్తిగతంగా మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అలాంటి వారి గురించి?... 
జవాబు...
~~~
అందరూ మారి మానవత్వపు పరిమళాలు వెదజల్లాలనే కోరిక
ప్రశ్న...
~~~
*మీకు ఏఏ రంగాలలో ప్రవేశం ఉంది?.. 
జవాబు...
~~~
*సాహిత్యరంగం.....అందంగా ముగ్గులు వేయడం
ప్రశ్న...
~~~
 * మీకు సామాజిక, సాహిత్యం రంగాలపై మీకు అభిరుచి ఎలా ఏర్పడింది?
జవాబు...
~~~
 * సమాజం నుంచి మనిషిని విడదీసి చూడలేం.సమాజప్రభావం వ్యక్తి మీద చాలా ఉంటుంది.ఆ సమాజాన్ని మార్చగలిగే శక్తి సాహిత్యానికి ఉందని నమ్ముతాను.
ప్రశ్న...
~~~
 * కవిత్వం అంటే మీదృష్టిలో నిర్వచనం ఏవిధంగా చెపుతారు? 
ప్రశ్న....
~~
కవిత్వం సామాన్య జనాన్ని కూడా చైతన్యవంతం చేసేదిగా ఉండాలి.
ప్రశ్న...
~~~
* మీరు రాసిన, మీకు నచ్చిన కవిత ఒకటి చెప్పండి...
జవాబు...
~~~
రెక్కలు తొడిగిన ఉత్సాహం
~~~~~~~
ప్రభాత వేళలో
అరవిరిసిన పూబాలలను 
చూడగానే
నాలోని ఉత్సాహం
తన రెక్కలపై
నన్ను మోస్తూ
మనోజ్ఞ సీమలను
వెదుక్కుంటూ
ఎగిరిపోతుంది...!
చదువులమ్మ గుడిలో
ముద్ద మందారాల్లాంటి
ముద్దు మోములను
కనినంతనే
ఆ దేవుడే దిగివచ్చి
వరాలిచ్చినంత సంబరం...!
అలసటెరుగని శ్రమ
విజయాల మాలతో
నా ఎదురుగా నిలబడితే
పట్టరాని ఉత్సాహం
పరుగులు పెడుతుంది....!
ప్రశ్న...
~~
* ఎలాంటి కవిత్వం మీరు ఇష్ట పడుతారు ? 
జవాబు...
~~~
* అణగారిన వర్గాలకు బాసటగా నిలిచే కవిత్వాన్ని ఇష్టపడతాను
ప్రశ్న...
~~
* మీరు కవిత్వం ఎప్పటి నుంచి రాస్తున్నారు 
జవాబు..
~~
* చాలా చిన్నప్పటినుండి...మనసు స్పందించినపుడల్లా రాస్తుంటాను.
ప్రశ్న...
~~~
* ఏఏ సాహితీ ప్రక్రియలు యందు తమకు అవగాహన, అనుభవం వుంది? 
జవాబు...
~~~
* వచన కవిత్వం..కథలు... గజల్స్...నానీలు... మొగ్గలు...సమ్మోహనాలు..షాడోలు
ప్రశ్న
* మీరు రాసిన ఏఏ రచనలు పుస్తక ప్రచురణలు నోచుకొన్నాయి. 
జవాబు...
~~~
* నేనంటూ ఇప్పటివరకు ప్రచురించలేదు.కాని చాలా సంకలనాల్లో నా కథలు, కవితలు, వ్యాసాలు ఉన్నాయి
* మొదటి పుస్తకం ఏది? 
ప్రశ్న...
~~~
* మీ రచనలు యెక్కడెక్కడ ప్రచురణ అయ్యాయి. 
జవాబు..
~~
* ప్రముఖ దినపత్రికల్లో....మాసపత్రికల్లో
ప్రశ్న...
~~
* బహుమతులు, అవార్డులు వేటికి లభించాయి.
జవాబు...
~~~
* నెలవంక - నెమలీక వారి నగదు పురస్కారం
* అంబేద్కర్ కవితల పోటీలో జిల్లా ద్వితీయ స్థానంతో
* నగదు పురస్కారం
* రాయగడ రచయితల సంఘం నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో ద్వితీయ స్థానంతో నగదు పురస్కారం
* సర్వోదయ మండలి వారు నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో నాలుగు సార్లు ఉత్తమ కవితలు
* ఉగాది పురస్కారాలు
* విష్ణుసాయి జ్యోతి వారు నిర్వహించిన పోటీల్లో
* మూడు సార్లు ప్రధమ ద్వితీయ స్థానం పొంది
* కవిజ్యోతి బిరుదు
* ఆటా పురస్కారం
* ఎక్స్రే పురస్కారంతో నగదు బహుమతి
* తెలుగు.కామ్ వారి నగదు బహుమతి
* ఎన్టీఆర్ అవార్డు
* మహిళా శిరోమణి అవార్డు
* ఆంధ్ర రత్నం అవార్డు
* తమిళనాడు అమ్మ అవార్డు
* రోటరీ వారి నేషన్ బిల్డర్ అవార్డు
* విద్యా సేవారత్న అవార్డు
* ఢిల్లీలో నేషనల్ ఎక్స్లెన్సీ అవార్డు
* ఇంకా చాలా....చాలా...
ప్రశ్న...
~~
* మహిళలకు స్వాతంత్ర్యం, ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత వరకు అవసరం? 
ప్రశ్న...
~~
* మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది
ప్రశ్న...
~~
*  ఇప్పుడు మహిళలకు స్వేచ్చ వుందా? 
జవాబు..
~~~
*  గతంతో పోలిస్తే కొంతవరకు నయం అనే చెప్పొచ్చు.కాని పురుషాధిక భావజాలపు ఊడలు ఉన్నంతవరకూ లేదనే చెప్పాలి.
ప్రశ్న..
~~
* ఎలాంటి స్వేచ్చ కావాలి? 
జవాబు..
~~
* మహిళలు ఏవిధమైన న్యూనతాభావానికి గురికాని స్వేచ్ఛ కావాలి.
ప్రశ్న...
~~~
*ప్రేమ, పెళ్లి సంస్కృతి, సంప్రదాయాలపై మీ అభిప్రాయం? 
జవాబు...
~~
*మన సంస్కృతిలో మంచీ ఉంది. మూఢత్వమూ ఉంది.
*పరిపక్వతతో ఆలోచించి చేసుకునే ప్రేమపెళ్ళిళ్ళను సమర్థిస్తాను.
ప్రశ్న...
~~~
* ప్రస్తుత వ్యవస్థలో టీవీలు, సినిమాలు, మీడియా, మొబైళ్ళ వల్ల  పిల్లలపై ఏలాంటి ప్రభావం వుంది ?
జవాబు...
~~~
* చాలా చెడు ప్రభావముందనే చెప్పుకోవాలి. మంచినే స్వీకరించే పరిస్థితులు ఎక్కడా లేవు
ప్రశ్న...
~~
* పసి వయస్సు ఆడ పిల్లల వయసు పైబడిన ముసలవ్వ దాకా పైశాచికంగా మృగాల అత్యాచారాలపై మీ స్పందన తెలపండి? 
ప్రశ్న...
~~
* దీనికి ఏ ఒక్కటో కారణమని చెప్పను. మూలాలు శోధించాలి.వ్యవస్థలో సమూల మార్పులు వచ్చినప్పుడే
* ఇవన్నీ అరికట్టబడతాయి.
ప్రశ్న...
~~
* ఈ ఆధునిక కాలంలో ఎలాంటి మార్పులు కోరుకొంటున్నారు? 
జవాబు...
~~
* సమసమాజ భావజాలం నరనరంలో వేళ్ళూనాలి.
ప్రశ్న..
~~
* మార్పులు రావాలంటే ఏం చేయాలి? 
జవాబు...
~~
* మనిషి ఆలోచనా విధానం మారాలి.
ప్రశ్న...
~~
* కొత్తగా సాహితీ బృందావన జాతీయ వేదిక   నిర్వహించే ముఖాముఖిపై మీ అభిప్రాయం ఏమిటీ? 
జవాబు...
~~~
* చాలా చక్కటి కార్యక్రమం
ప్రశ్న...
~~~
* ఈ ముఖాముఖిలో మీరు ఎలాంటి అనుభూతి పొందారు? 
జవాబు...
~~~
* అవ్యక్తానుభూతిని పొందాను
**
ధన్యవాదాలు

కామెంట్‌లు