ఆశ్చర్యం !!?; - ప్రతాప్ కౌటిల్య
అంద వికార
కోతి నుంచి
మనుషులు పుట్టడం
మామూలే!! కానీ
అందమైన
ఆడవాళ్లు పుట్టడమే
ఆశ్చర్యం !!!?

మనసు వయసును బట్టి
మారుతుంది ! కానీ
బుద్ధి వయసును బట్టి
మారదు !!?

బుద్ధుడు అయినా సరే
యోధుడు అయినా సరే
ప్రేమ స్నేహం లేకుండా
ఉండలేడు!!?
స్త్రీ లేకుండా ఈ రెండూ ఉండవు!!!?

ప్రపంచం సంపన్నంగా కాదు
సంతోషంగా ఉండాలని
ప్రార్థిస్తున్నాను!?
సంతోషంగా ఉంటే
దయ జాలి తో కొంత
దానం చేస్తారు!!
కోపంగా ఉంటే దండన తప్ప
దానం ఉండదు!?

దేహాన్ని గానీ
దేశాన్ని గాని
కాపలా కాస్తున్న ది
ఎర్ర రక్త కణాలు కాదు
తెల్ల రక్త కణాలే !!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273

కామెంట్‌లు