సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు,

 సత్యము-
@ నగ్నసత్యాలు అర్థం కావడానికి సమయం పడ్తుంది.అందరూ బుద్ధత్వం పొందే శక్తివున్నవారే. ఓషో రజనీష్
@జీవితంలో సత్యం పలకాలి.  ప్రియమైన మాటలు పలకాలి.  అయితే ప్రియం కాని సత్యాన్ని పలకకపోవటం శ్రేయస్కరం.మనుస్మృతి
@జ్ఞానానికి నాంది సందేహంలో ఉంది.  సందేహం వల్ల ప్రశ్న పుడుతుంది.  దానివల్ల సత్యం తెలుస్తుంది.  పియరె అబెలార్డ్
@డబ్బు మాట్లాడుతూ ఉన్నంతసేపు సత్యం మాట్లాడకుండా మౌనం వహిస్తుంది.   రష్యన్ సామెత
@దయాగుణం, సత్యం పరస్పరం కలిసే ఉంటాయి, అలాగే ధర్మం, శాంతి ఒకదానినొకటి పెనవేసుకొని ఉంటాయి. బైబిల్
@ధర్మపీఠంపై కూర్చుని సత్యం పలకని వాడిని తక్షణమే వదిలి వేయాలి. 
@నిజాన్ని ఎవరూ దాచలేరు, అణచివేయడానికి ప్రయత్నిస్తే, అది బయటకు వచ్చి అత్యంతకాంతితో ప్రకాశిస్తుంది. విలియమ్ బ్రియాంట్
@పుస్తకాల కంటే జీవితాచరణే ఎక్కువ వివేకం ప్రసాదిస్తుంది. ఈ సత్యం మరచిపోవద్దు. యానన్
@ప్రతి మతంలో సత్యం కొంత, అసత్యం మరికొంత వున్నాయి.

కామెంట్‌లు