సైనికుడు బాలల గేయం; -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయుని పిఎస్ నంది వడ్డెమాన్ నాగర్ కర్నూలు జిల్లా
సైనికుడు అంటే
దేశ రక్షకుడే కాదు

పక్షులను కాపాడిన
సలీం అలీ
క్షీపణులను పేల్చిన
అబ్దుల్ కలాం కూడా
ఒక సైనికుడే !?

ఆకాశంలో నడిచిన తారలు
రాకేష్ శర్మ కల్పనా చావ్లా
సునీత విలియమ్స్ కూడా
మన సైనికులే !?

పెద్ద పెద్ద చదువులు చదువుకొని
గెలిచినా అంబేద్కర్ ఒక విద్యార్థే
ప్రతి విద్యార్థి
ఒక సైనికుడే !!?

ఆత్మహత్యలు హత్యలు కాదు
సత్యం ధర్మం కోసం
పోరాడేవాడు ఒకడు
అవమానం మానం కోసం 
పోరాడేవాడు

ఒకడు
వాడే సైనికుడు !!?

నీవు దేహాన్ని కాపాడు
దేహం ఈ దేశాన్ని కాపాడు తుంది
నీవు అక్షరాన్ని తయారు చేయి
అక్షరం నీ లక్ష్యాన్ని చేరుస్తుంది !!

26th Januaryనీ పురస్కరించుకుని
Sunita Pratap teacher Nandi Waddeman Nagar Kurnool Kurnool
కామెంట్‌లు