వేకువ కల;-కవిత సీటిపల్లి;-కలం స్నేహం
 ఆ ఎర్రని సూర్యుని కాంతులతో...
పచ్చని నేల వెచ్చని కిరణాలలో...
కళ్లల్లో కోటి కాంతుల ఊయలలో...
సొగసు లతలు ఉప్పొంగే 
నవ వర్ణ పుష్పాల అందంతో...
వలిచే తుమ్మెద సరాగాల * 
చుర కత్తుల చూపుల
దాటికి దాగని యవ్వన మధువు సయ్యటలలో...
ఒదిగి ఒదిగి పల్లె అందాల అరుణావని కౌగిల్లో...
నీది నాది అనే భావన లేని బ్రతుకు బాటలో...
గుబాలించే గులాబీలు
గుండెను హత్తుకుంటే ...
ముళ్ల గాయాలు 
"వేకువ కల"ల కనురెప్పల అంచున చైతన్య దీపికలై ...
ఆశల రెక్కలు కట్టుకుని ఆకాశం చుక్కలు దాటుకొని ...
ముద్దు గుమ్మల ముచ్చట్ల
లోగిలిలో...
కురుల వయ్యారపు అలకలు తీర్చే వసంత అడుగులు దరహాసంలో...
బాటసారి పిలుపు స్వరంలో..
మరో లోకం చూపించే సుందర ప్రకృతి శిల్పం....
ఎన్నో గత  జ్ఞాపకాల తీరంలో...
ఎద సమీరపు చీకటి తొలగించే కుసుమ వికాసం...
సంద్రపు దప్పిక తీర్చని నీ కోరికల సెగలో...
నీ స్వార్థం నిండిన ఆకలి ఆలోచనలలో...
ఇంద్ర ధనుస్సు హరివిల్లు  లాంటి బృందావన  
ఆనందపు జన"జీ"వనం"ను నలుపు చేయకు నీ కుంచె తో...

కామెంట్‌లు