భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందుకున్న తెలంగాణ మోడల్ స్కూల్ స్కౌట్ మహేష్


భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రీజనల్ క్యాంపింగ్ సెంటర్ -వరంగల్ లో 29-03-2021 నుండి 31-03-2021 వరకు  "Free being me and Action on Body Confidence workshop" జరిగింది. ఈ వర్క్షాప్లో వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాలనుండి 40 మంది స్కౌట్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మోడల్ పాఠశాల-పర్వతగిరి నుండి భూక్యా మహేష్ (10 వ తరగతి) విద్యార్ధి పాల్గొని చక్కని ప్రతిభ కనపరిచాడు.కోవిడ్ -19 కారణంగా గత సంవత్సరం పాఠశాలలు మూతపడటంతో సర్టిఫికెట్లు ఆలస్యంగా గతవారం బి.ఎస్.జి.నేషనల్ హెడ్ క్వార్టర్స్-న్యూఢిల్లీ వారు పంపడం జరిగింది. సర్టిఫికెట్ అందుకున్న మహేష్ ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
కామెంట్‌లు