పొట్టి పాప చిట్టి చిలక (బాల గేయం);-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
చిట్టి పొట్టి పాపాయి
చిట్టా చిట్టా రావమ్మ
గట్టుమీద నడవమ్మ
చెట్టు కింద చేరమ్మ

చెట్టు మీద చిలకమ్మ
చిట్టి పాప వచ్చింది
పొట్టి పండు తెంపమ్మ
చెట్టు కిందికి వేయమ్మ

పాప పండు చూస్తుంది
బొజ్జ నిండా తింటుంది
గట్టిగ నిన్ను పిలుస్తుంది
పాపా పిలుపు వినవమ్మ

చెట్టు కిందికి రావమ్మ
చిట్టి పాపతో ఆడమ్మ
ఆటలు ఆడి పాపాయి
హాయిగ నిద్రపోతుంది


కామెంట్‌లు