అమ్మ నాన్నలు(బాల గేయం);-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
అమ్మ ఒడి మనకు బడి
అక్షరాల ఆలయాల గుడి 
అమ్మ నేర్పేటి మాటలు
మనకు ముత్యాల మూటలు

నాన్న పట్టే చేతి పట్టు
నడకకు అది పెద్దగట్టు
చేతి పట్టు వదలకుండ
ఎక్కి చూడు పెద్దగట్టు

అమ్మే మొదటి దైవము
మనము అ

డగకుండనే
సమకూర్చి పెట్టును అమ్మ
మరువబోకండి అమ్మను

నాన్నోడ్చె చెమట చుక్కలు
మీ బ్రతుకు దారికి దిక్కులు
అమ్మ నాన్న ఆ శిష్యులు
మీ బ్రతుకంత సుఖ దారులు

కామెంట్‌లు