చైతన్యం ;-వరలక్ష్మి;-కలం స్నేహం
 చక్కని కవణం రాయాలని కలం చేతబట్టి 
చాలా లోతుగా ఆలోచిస్తే   భావలతరంగలు  అలల లా కెరటాలు గా లేచి నను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి
చిత్రమైన అనుభూతులు అనుభవాలు, నన్ను వెంటాడుతున్నాయి
చీకటి చీల్చుకొని వెలుగును ప్రసరింపచేయలని సమాజాన్ని మేలుకొలపాలని 
చుట్టూ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు  ఆపాలని నీతి నిజాయతీలకు పట్టం కట్టాలని గళమెత్తి  గర్జించలేను
చూడలేను అరాచకాలు అత్యాచారాలు  అందుకే కలం పట్టి రాయాలని ఆకాంక్ష
చెడును పోగొట్టాలంటే
ఆవేశం సిరా నింపుకొని  రక్తాక్ష్రాలు 
రాయాలి
చేయాలి  ఎంతటి త్యాగామయిన సమ సమాజ నిర్మాణం కోసం
చైతన్యం  రావాలి 
 
చొరవ చేసుకొని ముందుకు సాగిపో వాలి పోరాటం ఆయుధంగా  అధికారులను నిలదీయాలి
చోద్యం చూస్తూ కళ్ళుమూసుకొని  వుంటే వెలుగు రాదు లేవండి నిద్ర లేవాలి అంటు నా కలం కన్నీరు కారుస్తోంది
యుద్ధం చేస్తేనే గెలుపు సొంత మవుతుంది

కామెంట్‌లు