గీతాంజలి ; రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 57.“ కాంతి - హృదయ దీప్తి కాంతి, ప్రపంచాన్ని నిండిన కాంతి, కంటికి దీపమైన కాంతి, హృదయ మధురోజ్వల దీప్తి, నాజీవిత మూలంలో నృత్యకాంతి ప్రేమరాగాలను పలికిస్తుంది. విప్పుకున్న ఆకాశం లయపూరిత వాయు చలనాలమధ్య నవ్వులు, కేరింతల విన్యాసాలతో పుడమి పులకరించిపోతుంది. కాంతి సముద్రం మీద రెక్కలు విప్పిన సీతాకోకచిలుక సరాగాలాడుతుంటే కాంతితరంగాల నురగలపై మల్లెలూ, కలువలూ గోచరమౌతున్నాయి. ప్రతిమేఘపు కొంగునా బంగారు ఛాయాదీప్తిని కాంతిసముద్రం వెదజల్లుతోంది. “ఆహ్లాదం ఆకునుంచి ఆకుకు పరుగులు పెడుతుంటే గట్టు తెంచుకున్న ఆకాశగంగా ప్రవాహంలా ఆనందం సర్వత్రా వ్యాపితమైంది.
              
కామెంట్‌లు