గీతాంజలి ; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 59. "ప్రేమ ప్రతీకలు” ఈశ్వరుడు ప్రకృతి పరంగా మనకోసం కల్పించి చేస్తున్న నేత్రోత్సవ దృశ్యాలన్నీ మనం హృదయగతం చేసుకోగలిగితే అదే భగవంతుడు మనకు ఇచ్చే మేలుకొలుపు సందేశం వంటిదని...
ఎల్లవేళలా ఆయన కురిపించే దయావర్షమే ఆకులపై పసిడి మెరుపుల లయవిన్యాసమని, ఆకాశం మీద మెల్లమెల్లగా కదులుతున్న మేఘమాలికాదృశ్యమని, మనకు చల్లటి స్పర్శానందాన్నిచ్చి వెళ్ళే వాయు వీచికని వర్ణిస్తున్నాడు. ఇలా పైలోకాలనుంచి భగవంతుని నేత్రాలు భక్తుని కళ్ళలోకి చూస్తుంటే భక్తుని హృదయం మాత్రం భగవంతుని పాదాలను స్పర్శిస్తూ మోకరిల్లింది.
             
కామెంట్‌లు