*అంధులఆరాధ్యుడు-లూయిబ్రేయిలి*;-*మిట్టపల్లి పరశురాములు*
 *తే.గీ*
బాల్య దశలోనబ్రేయిలు-బాగుగాను
విశ్వ మందున చిత్రాల- వింతలెన్నొ
  కనులనిండుగగాంచెను-కాంతులీన
మురిసిపోయెనుఎదలోన-ముదముతోడ
*తే.గీ*
తండ్రిమెకనికుషెడ్డున-తనయుడాడ 
పదును కత్తినొకటికంట్లొ-పరగగుచ్చ 
 రక్తధారలుకారగ-రయముగాను
తల్లిదండ్రులు రోదించె తల్లడిల్లి
*తే.గీ*
నాటికాలమునందున-నాటుమందు 
వాడుచుండెనుజనులంత-వసుయందు
పసరుకంటిలోపోయగ-పరగనపుడు
కంటిచూపునుకొల్పొయె-కనగలూయి
*తే.గీ*
చూపుకోల్పొయిఅంధులు-చూడలేక
మదిలోకలవరపడుచుండ-మనసుకరిగి
ఆరుచుక్కల లిపిని- అందజేసి
చదువునేర్పించెబ్రెయిలీ-చక్కగాను
*ఆ.వె*
అంధకారమందు-నలమటించెడివారి
కాప్తబంధువుగను-కాపుగాచి
బతుకుపథములోన-బంగరుబాటను
వేసినాడులూయి-వెలుగుజూపి
                 ****                

కామెంట్‌లు