నూతన ప్రణాళికలతో ఆంగ్ల సంవత్సరాది కి స్వాగతం.తంగెళ్ళపల్లి ఆనందాచారి
స్వాగతం నూతన సంవత్సరమా
స్వాగతం ఆశల దీపమా
శుభాలు మాకు ఒసగుమా...
చూడచక్కని తెలుగు సున్నితంబు

కరోనా కష్టాలతో కదిలిపోయాము
కనీవినీ ఎరుగని బాధలుపడ్డాము
నీవైనా తీరుస్తావని ఆశిస్తున్నాము
చూడచక్కని తెలుగు సున్నితంబు

రైతులంతా కష్టపడి పంటతీసారు
పంటనమ్మి పండగ చేసుకోవాలనుకుంటున్నారు
కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు
చూడచక్కని తెలుగు సున్నితంబు

చదువులు పూర్తిచేసిన విద్యార్ధులు
కావాలం

టున్నారు సరైన ఉద్యోగాలు
తీర్చుమా విద్యార్ధుల ఆశలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

అందరి ప్రణాళికలు అమలుగావాలి
అందరికీ అవకాశాలు సమంగారావాలి
ప్రజలంతా ఆనందంగా జీవించాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు