నేడు లూయీ బ్రెయిలీ పుట్టిన రోజు!చిట్టి కవిత🌷 అచ్యుతుని రాజ్యశ్రీ

 లూయీ బ్రెయిలీ జన్మదినం!
ఆటపాటల చిన్నారి 
నాన్న పనిముట్లతో ఆడుతూ 
పోగొట్టుకునే కంటిని!
అంధకారంలో మునిగి అలమటిస్తూ కూచోక
కనుచూపు లేనివారికై లిపిని
కనుగొన్న మహానుభావుడు!
బ్రెయిలీ లిపి పితామహుడు!
కనులున్న మనకు దారిచూపిన
ఆదర్శ జీవి!
దివ్యాంగులే మనకు దారిచూపే
దివ్వెలు!చరిత్రలో మిలమిలలాడే తారకలు!🌹
కామెంట్‌లు