గీతాంజలి ;-రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 63. నిన్ను తెలుసుకుంటే పరుడనేవాడు లేడు.
'నిన్ను' అనే శబ్దానికి భగవంతుడు అనే అర్థాన్ని మనం చెప్పుకోవాలి. సర్వలోక రక్షణభారాన్ని వహించే భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అంతా ఒకే కుటుంబానికి చెందినవారనే విశాలదృక్పథం నిండివుంది. అందువల్ల ఆయనను అర్ధం చేసుకున్నవారికి ప్రపంచం అంతా వసుధైక కుటుంబం అనే సర్వసాన్నిహిత్య భావన కలిగి తీరుతుంది. అటువంటి స్నేహశీలురు ఎక్కడికి వెళ్లినా వారికి అన్ని వాకిళ్ళూ తెరిచే వుంటాయి అనే ఆత్మీయ భావనా సత్యం ఇది.
     
కామెంట్‌లు