బిలే --;-ముంతాజ్--కలం స్నేహం
జటాజూటధారి వరప్రసాది
విశ్వనాధ భువనేశ్వరిదేవిల ఆనందాల పంట
నరేంద్ర నాధ్ దత్త నామధేయుడు 
అల్లరిలో అఖండుడు
అమ్మ గారాలకూచి బిలే!

అవిద్య, అజ్ఞానం లోఉన్న ప్రజలను చైతన్య పరచుటకు ఉద్భవించిన మహోన్నత వ్వక్తి
భరతఖండమునకు అఖండ ఖ్యాతిని సముపార్జించి హైందవమునకు కొత్తరూపురేఖలనొసంగిన శక్తి
గురువు మనోభీష్టాను సారము
ప్రపంచానికే నీడనిచ్చే విజ్ఞానపు మర్రిచెట్టయి విరాజిల్లినాడు!!

తన తేజోవంతమైన దివ్యసందేశాలతో
యువహృదయాల్లో ధైర్యసాహసాలను ఊపిరిగా నింపి
మాతృదేశ దాస్య శృంఖలాలను తెంచుటలో
ఆంగ్లయులను ఎండగట్టుటకై
యువతను మేలుకొల్పి...
వేటగాళ్ళను తరుముటకై నడుం బిగించి 
సమరానికి సిద్ధపడందంటూ,యువ 
హృదయాలపై ధైర్యనగారాను మోగించిన 
మహోన్నత శక్తి నరేంద్రుడు!!

దైవ భక్తులు, దేశభక్తులే కాకుండా
తీవ్రవాదులను సైతం ప్రభావితమొనరించి
 అందరి మనసులలో "
స్వామి వివేకానందుడి"గా చిరస్మరణీ యుడైనాడు
అందుకే ఆయన జన్మదినం
భరతావనికే పర్వదినం!!


కామెంట్‌లు