* అవరోధాలనధిగమించి *;-...కోరాడ నరసింహా రావు !

 కన్యాశుల్కా  లైతేనేం...., 
వరకట్నాలయితేనం.... !
బలైపోయేది... ఆడబిడ్డే..., 
కన్నకూతురే.... !!
బాధపడేది... కన్న పేగే .... !
ఆడపిల్ల పుట్టిందంటే... కళా, కాంతులతో శ్రీమహాలక్ష్మి కరుణించి అరుదెంచిందని... 
సంబరపడే రోజులు పోయి... 
ఆమ్మో ఆడపిల్ల... అని హడలిపోయిన రోజులవి... !
 ఆడపిల్ల -  కోడిపిల్ల  స్వేచ్ఛగా 
బయట తిరగలేవు కదా... !
ఆడబిడ్డపై... తల్లిదండ్రులకు ప్రేమ... అదెంతున్నా....,ఆమె ఆనందంగా నవ్వితే  భయం !
హాయిగా ఆరుబయట... ఆడు కుంటే భయం !! పెద్దపిల్లయినాక స్కూల్ కు వెళ్లి 
చదువుకుంటానంటే భయం... !
ట్యూషన్కు పంపాలన్నా...  భయమే... !! భయం సృష్టించి న అడుగడుగు ఆంక్షలు... !
  అసమానతల వివక్ష... !!
వీటికి తోడు... సాంఘిక దురాచారబాల్యవివాహాలు...,సతీసహగమనాలు ! దయనీయ  బాల వితంతు జీవితం... !
చదువులేదు, స్వేచ్ఛలేదు... 
ఆడపిల్లజీవితం వంటింటికే పరిమితం....చాకిరీకే అంకితం  !!వేదనలు, మౌన రోదనలు... ఆరాటాలు, పోరాటాలు... ఫలించి...
సంస్కరణవాదులు అండదండై నిలిస్తే... చట్టాలు పుట్టుకొచ్చి
చేయూతనిస్తే...., 
 భ్రూణ హత్యలకు బలైపోక... అవరోధాలను అధిగమించి... ఉన్నతవిద్యావంతులై... అన్నిరంగాలలో తమ సత్తాచాటుతున్న నేటి మహిళా లోకంఆనందంతోజరుపుకుంటోందిబాలికాదినోత్సవ...సంబరాన్ని.... !
కన్నతల్లిదండ్రులకు తోడబుట్టిన సోదరులకు కన్నుల పండుగ కాగా... !!
        ***-***

కామెంట్‌లు