పెద్దముల్ కేజీబీవీ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి;-సోషల్ వర్కర్ వెంకట్ నేటి మహిళలందరికీ  ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే:
పెద్దముల్ మండల పరిధిలోని మారేపల్లి గేటు దగ్గరున్న కేజీబీవీ పాఠశాలలో సంఘసంస్కర్త భారత దేశపు తొలి మహిళా  ఉపాధ్యాయురాలు
బాలికల చదువుల కోసం .స్త్రీ విముక్తిఉద్యమానికి ఓనమాలు నేర్పిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి కేజీబీవీ పెద్దముల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమానికి మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత సోషల్ వర్కర్ వెంకట్ పాల్గొని మాట్లాడుతూ నేటి మహిళలందరూ ఆమె స్ఫూర్తితో ని చదువుకుంటున్నారు అంటే ఆమె స్థాపించిన పాఠశాలల వలన మహోన్నతమైన స్త్రీ  విద్యా విధానం కుల విచక్షణ కారణంగా  ఆడపిల్లల చదువుకు దూరంగా ఉన్న సమయంలో ఆమె చేసిన పోరాటం గొప్పది ఉపాధ్యాయురాలిగా సమాజంలో మార్పు వలన ఈరోజు మహిళలందరూ చదువుకుంటున్నారు
సామాజిక అభివృద్ధిలో విద్యా ప్రమాణాలను గుర్తించి పూలే దంపతులు చేసిన కృషి స్ఫూర్తిగా తీసుకొని   సమాజంలో చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు
సంఘసంస్కర్తగా
సావిత్రిబాయి పూలే మదర్ తెరిసా
ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి
వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి విద్యార్థులు మహిళలు ఎదగాలని కోరారు
ఈ కార్యక్రమంలో  లో10 తరగతి విద్యార్థిని రాధిక సావిత్రిబాయి పూలే వేషధారణ అందరినీ ఆకట్టుకుంది
విద్యార్థులకు వ్యాసరచన పోటీలలో గెలుపొందిన చిన్నారులకు కు
పుస్తకాలు బహుమతిగా వెంకటేశ్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు  ప్రత్యేక అధికారినీ రాజేశ్వరి తోపాటు ఉపాధ్యాయులను అందరినీ ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో విద్యార్థుల. ఉపాధ్యాయుల ఉపన్యాసాలు
అందరినీ మేలుకొలిపిన వి
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని రాజేశ్వరి. ఉపాధ్యాయులు ప్రశాంత. ప్రవీణ అనిత
అరుంధతి ఉమారాణి గోపిక పల్లవి శ్రీ వాణి విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు