అరుదైన బంధం;-సంధ్యా కుమారి ఎరుసు;-కలం స్నేహం
ఒక మనిషి మరో మనిషిని
ఇష్టపడే తత్వం ప్రేమతత్వం
చిన్నా పెద్దా తేడా లెరగని 
ప్రేమ అమరత్వం

గోరంత ప్రేమ కొండంత బలం
అంతరాలను మరిచే తత్వం
అంతరంగాలను తాకే ప్రేమ
ఇరువురి నడుమ సాగే చల్లని
స్నేహం మరో తరానికి ఆదర్శం

మరువలేని జన్మదినం
మరువలేని ప్రేమ ఝరి
మమకారపు అందెల సవ్వడి
నిత్యం మనసును అలరించే
మువ్వల సవ్వడి

ఎల్లలు ఎరగని
అసమానతలు తెలియని
అరుదైన పదాలకు అందని
భావం మనసు తడిచేసేను
ఇరువురి నడుమ

తను నడిచే ప్రతి అడుగులో
నిత్యం కురిపించే లాలిత్య సవ్వడి మురిసి మెరిసేను
ఇరు హృదయాల బంధం
అనుబంధమై సాగేను


కామెంట్‌లు