శుభతరుణం;-మర్రి జయశ్రీ;-కలం స్నేహం
నా ప్రియ సఖుడా!
నా మదిలో మెదిలే నీ రూపమే
ప్రతి క్షణం నీ ధ్యానమే
నా మనసే నిలువలేక వ్రాశాను ఒక లేఖ

పల్లవి..తొలి చూపులోనే కలిగింది నాలో నీపై ప్రేమ
ప్రతి నిత్యం నిన్నే తలుస్తూ
నీ ఆలోచనలే చుట్టుముడుతుంటే
ఆగదే నా మనసు..

చరణం..నిన్ను తలచుకోగానే
మదిలో కలిగెను తుళ్ళింత
ఏదో తెలియని కవ్వింత
 నా మదిలో అలజడి చెలరేగేను
నీ పిలుపుకై అనుక్షణం పరితపిస్తుంది నా మది....తొలి చూపులోనే

చరణం...ఆకాశంలో హరివిల్లులా
మెరిసే తారకలా
నీ మోములో ఎన్నో వెలుగులు
నిండు చందమామ
అందాల చిరునవ్వుల పున్నమి జాబిలి
ఎంతని తెలుపను నీపై ప్రేమ...తొలి చూపులోనే

చరణం...నింగి నేల మన ప్రేమకు సాక్ష్యాలు
మన ప్రేమ మధురం
నీ కోసం ఎదురు చూస్తూ
అనుక్షణం నీ కై కలవరిస్తూ
వేచి ఉంటాను

కలుసుకునే శుభతరుణం దగ్గరలోనే ఉందనే ఆశతో....తొలి చూపులోనే

కామెంట్‌లు