బ్రతుకుబాట :-మిత్రుడు... పాస్టర్డేనియల్..!కోరాడ నరసింహా రావు

  ** 51 **
వాళ్ళపిల్లలకి పాస్ ఫోటోస్ తీయించటానికి ఓ మారు స్టూడియో కి వచ్చిన పాస్టర్ డేనియల్ మిత్రుడయిపోయి 
తరచుగా వస్తుండటం... అప్పుడప్పుడూ నరసింహా రావుగారు... ఓ ఇరవై ఉంటేయిస్తారా... ఓ ముప్పై రూపాయలివ్వండి సార్ నాలుగు రోజుల్లో  ఇచ్చేస్తాను అంటూ.. అవసరానికి డబ్బు లడిగి తీసుకెళుతుండేవాడు,
ఒకోమారు...ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండానే మళ్ళీ చేబదులడిగేవాడు... మొన్న తీసుకెళ్లిన డబ్బులివ్వలేదు... 
అని అడిగితే... అవిచ్చేసాను కదండీ అనేవాడు !
పాపం... అతని ఆర్ధిక పరిస్థితి అంత అద్వాన్నంగా ఉండేది !
ఏమండీ... మీ పాస్టర్ లు చాలామంది బాగా ఖర్చుపెడుతుంటారు మరి మీపరిస్తితేంటి ఇలా అని ఓ మారు నేనడిగితే... మాది సెవెంత్ డే ఎడ్వెంటిస్ట్ సంస్థoడి
 మాకు ఫారిన్ ఎయిడ్ సరిగ్గా రావటంలేదు.. అనేవాడు !
అలాంటిది... ఓ రోజు సడన్ గా 
అతని తీరే మారిపోయింది !
కొత్త బైక్ తో ... టక్ చేసి, టై కట్టి, కాస్ట్లీ షూస్ తో టిప్ టాప్ గా కనిపంచాడు !
నే నాశ్చర్యపోయి అడిగితే...
ఫారిన్ నుండి మా సంస్థ వాళ్ళు  
చుట్టుప్రక్కల విలెజ్ ల లో చర్చ్ 
లు కట్టించమని ఫండ్ పంపించారు సార్ ! మంచి సాలరీ ఫిక్స్ చేసి... తిరగటానికి బైక్ ఇచ్చారు... అంటూ చాలా ఆనందంగా చెప్పాడతను !
రోగులకు వైద్యం, బీదలకి గోధుమలు, జొన్నపండి, నూనె లాంటివి ఉచిరం గా ఇవ్వటం !
హిందువులు దూరంగా ఉంచిన వారినందరినీ చెరదియ్యటం... 
ఇలాంటి మంచిపనులతో... 
నాకు తెలిసి చాలామంది క్రిష్టియన్లు గా మారిపోయారు!
గత కొద్దికాలంగానే... అడుగడుగునా ఈ చర్చిలు...
ప్రచారాలు, మత మార్పిడిలు!
మాచిన్నప్పుడుమేముక్రిష్టియన్ స్కూల్లోనే చదువుకున్నాం ! 
సిస్టర్లు...పేదలకు,గోధుమబియ్యం,జొన్నపిండి, నూనె అక్కడ ఇచ్చేవారు!నేనుకూడా నాలుగు, ఐదు తరగతులు చదువుతున్నపుడు గోధుమ బియ్యం, జొన్నపిండి  మా అమ్మను మాస్కూలుకి తీసుకు వెళ్లి.... తెచ్చుకుండేవాళ్ళం !
వాళ్లేనాడూ మామతం  లో 
చేరండి అనిగాని..,మా స్కూల్ పిల్లలమంతా స్కూల్ లోకి రావాలంటే... గేటు దాటి లోనికి వచ్చిన వెంటనే చర్చ్, ఆ చర్చ్ దాటుకునే స్కూల్ లోనికి రావాలి.. ఐనా వాళ్లెప్పుడూ 
మా చర్చ్ కి రండి అని గాని... 
మా మతంలో చేరండి అనిగాని 
మాతో ఏనాడూ అనలేదు... !
ప్రచారాలెక్కువై... ఫారినైడ్ తో 
వీధికొక చర్చ్..., పాస్టర్ లు లక్షాధికారులుగా...పరిస్థితులీ రోజిలామార్పియాయి..నాస్టూడియోకి వచ్చిన వాళ్లలో... కొందరైతే...మొండిగా... మూర్ఖంగా వాదించేవారు !మిగతా దేవుళ్ళని సైతానులనే వారు !
ఏసే...దేవుడంటారు... మరి క్రీస్తుకు పూర్వం మాటేమిటి !?
అనిఅడిగితే,బదులుచెప్పారు !
తండ్రీ..."వీరేమిచేయుచున్నారో 
వీరెరుగరు...వీరి పాపములను క్షమింపుము అని..., తండ్రీ నా 
చేయి ఏల విడిచితివి... " అని 
క్రీస్తు మొరపెట్టుకున్న ఆ తండ్రి ఎవరు ?! అంటే సమాధాన ముండదు...!
 వీళ్ళిలా ఉంటే...,షిరిడీ సాయి బాబా... దేవుడు కాదుకదా 
అసలు సాధువే కాదు అతడొక ఫకీర్ అతడిని పూజించటం కాదు... ఆయన  ఫోటోలను కూడా  ఇళ్లల్లో ఉంచకండి అంటూ... 
లేనిపోని వివాదాలు సృష్టించి  నోటి తీట తీర్చుకునే పీఠాధి పతులు  కొందరు...!
సీత రాముడి దగ్గరకంటే.. రావణుని దగ్గరే బెటర్ అనే తలతిక్క బుర్రతిరుగుడుగాళ్ళు కొందరు.. ! వివాదాలన్నీ  మరచిపియి...అందరూహాయిగా కలిసిమెలిసి  బ్రతుకుతున్న ప్రజలమధ్య ఇన్నిన్ని  గందర గోళాలుసృష్టించటమెందుకో.... ఎంత తర్కించినా..నాకైతే...  అంతుపట్టని విషయమే... !!
       *******
   .......    సశేషం  .......
కామెంట్‌లు