మారుదాం !?; ప్రతాప్ కౌటిల్య
మనల్ని మనం చూసుకోలేం
మనల్ని చూసేది ఎదుటివాళ్లే !?
వాళ్ల కోసం మనం మార లేకపోతే
ఒక అద్దం కొందాం
మనల్ని మనం చూసుకుందాం
మనకోసం మనం మారుదాం !!?

మన జన్యువులే
మన సంపద
శరీర కణం కాలం క్షణమే
నిజమైన ధనం !?

కోపం వలన కాదు
శాపం వలన నేను రాయిని
నీవు మోస్తే నేను మహా పర్వతాన్ని !!
నీవు విరగ్గొడ్తే నేను గాజును
నీవు నిర్మిస్తే నేను గెలాక్సీ ని !?

మనం నిష్ప్రయోజకులమే
ప్రజలకు కానీ
నిజాలకు కాదు !?
సహజంగా మనం రోజుల్లా
ముందుకే ప్రయాణిస్తుంటాం
అందుకే మనం రాజులం!?

ఈరోజు నవ్వుతూ గడప లేకపోతే
నీవు ఏడుస్తున్నట్లే !?

అసూయ అహంకారం
మన మనసులో
రెక్కలు లేని పర్వతాలు !!!?
వాటిని పక్షులను చేసి ఎగరేస్తే
అవి పారిపోతాయి !?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273

కామెంట్‌లు