పోలయ్య కవికి...భగవద్గీత కవితకు...బహుమతి హిమాలయ శివసాయి గురూజీచే... ఘనసన్మానం
హైదరాబాద్ పుచ్చపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో
వాల్మీకి మహర్షి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో
ఇటీవల  పుస్తకావిష్కరణ సభ దిగ్విజయంగా జరిగింది

కళారత్న బిక్కికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో
డా. వి .డి.రాజగోపాల్ రచించిన” గీతావలోకనం” పుస్తకాన్ని హిమాలయ శివసాయి గురూజీ మరియు “కథానికలతో... కాసేపు” పుస్తకాన్ని ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్  ఆవిష్కరించారు... శ్రీమతి రాజావాసిరెడ్డి మళ్ళీశ్వరి  శ్రీమతి పావనేశ్వరి క్లుప్తంగా సౌందర్యంగా పుస్తక విశ్లేషణ చేశారు

అధ్యక్షులు కళారత్న బిక్కికృష్ణ మాట్లాడుతూ ఈ రెండు పుస్తకాలను ప్రముఖ రచయిత డా.వి.డి రాజగోపాల్ అలతి అదితి పదాలతో అతి సుందరంగా అత్యద్భుతంగా
అందరికీ అర్థమయ్యే రీతిలో రచించారని ప్రశంసించారు
డా.రాజగోపాల్ తనలోని కవిని గుర్తించి ప్రోత్సాహించిన గురువు బిక్కికృష్ణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ సభకు ప్రపంచ తొలి గీతావధాని డా.యడవల్లిమోహన్ రావు వాల్మీకి గ్రూప్ కార్యదర్శి లయన్ ఎం. అరుణ కుమారి తదితర ప్రముఖులు హాజరయ్యారు 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భగవద్గీత కవితల పోటీల్లో  ప్రముఖ కవి రచయిత పోలయ్య కవి వ్రాసిన భగవద్గీత...ఓ అక్షయ పాత్ర...ఓ అమృత భాండం అను కవితను ఉత్తమ కవితగా ఎంపిక చేసి నగదు బహుమతిని ప్రకటించారు

వారి సాహితీ సేవలకు గుర్తింపుగా హిమాలయ శివసాయి గురూజీ కళారత్న బిక్కికృష్ణ డా.విడి రాజగోపాల్  పోలయ్య కవిని మెమెంటో శాలువా పుష్పగుచ్ఛాలతో రెండు పుస్తకాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. 

పోలయ్య కవి మాట్లాడుతూ గతనెలలో తనకు మూడు సన్మానాలు జరిగాయని ఈ నూతన సంవత్సరంలో తాను మూడురోజులు కష్టపడి వ్రాసిన "భగవద్గీత కవితకు" నగదు బహుమతి రావడం హిమాలయ శివసాయి గురూజీ చే సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉందని, తాను ఈ కరోనా కాలంలో వ్రాసిన 1500 కవితలకు పడిన కష్టానికి మంచి గుర్తింపే వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తనకీ సన్మానం చేసిన శివసాయి గురూజీకి బిక్కికృష్ణకి
మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ గౌరవాధ్యక్షులు డా.వి.డి రాజగోపాల్ కు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేశారు

తనకు జరిగిన ఈ సన్మానానికి తనను అభినందించిన నిత్యం అభిమానించే ప్రోత్సాహించే తోటి కవిమిత్రులు అభిమానులు ముత్యం వెంకటేశ్వరరావు కొప్పుల ప్రసాద్ బోయ వెంకటేశం  త్రినాథరావు  రవికాంత్ శర్మ  ఆర్ ప్రవీణ్ 
జె బి కుమార్ చేపూరి  ఆదెయ్య  కృష్ణమూర్తి  పూసల సత్యనారాయణ  శ్రీరంగం సత్యనారాయణ... కావ్య సుధ...తాటిపాముల రమేష్  అద్దంకి లక్ష్మీ  భారత లక్ష్మీ ముంబై లకు ప్రత్యేకమైన ధన్యవాదాలంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.

ఇదిగో నా కవిత మీకోసం... 

శీర్షిక...భగవద్గీత - ఓ అక్షయపాత్ర ఓ అమృతభాండం

"సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః పార్ధో 
వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్"...

ఔను అర్జునుడే ఆవుదూడకాగ  
ఉపనిషత్తులే గోవులుకాగ 
గోపాలబాలుడైన శ్రీకృష్ణ పరమాత్మ పితికి 
సకల మానవాళికి అందించిన...
ఓ క్షీరధారే...ఈ గీతామృతం

పాండవుల కౌరవుల కురుక్షేత్ర రణరంగంలో 
అర్జునుని రథసారథి శ్రీకృష్ణపరమాత్మ 
హృదయక్షేత్రంలో ఉద్భవించిన...
ఓ అమృతభాండమే...ఈ గీతోపదేశం

ఎడారిలో ఎండమావే
నీటికొలననే భ్రాంతిని తొలిగించేది ఆత్మజ్ఞానమని 
జననం లేనిది మరణం‌ మార్పులేని
ఆత్మే పరమసత్యమని...
ఆ ఆత్మే బ్రహ్మమని...
ఆత్మ నిజతత్వాన్ని గ్రహించే....
ఓ తారక మంత్రమే...ఈ భగవద్గీత

సత్వ రజ తమోగుణములకు  
కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గములే దివ్యమైన రాజమార్గములని ఘోషిస్తున్న...
ఓ మంత్రదండమే...ఈ భగవద్గీత

సంశయాలతో సతమతమై దుఃఖాగ్నికి దగ్ధమైపోయె
సృష్టిలోని సకల జీవరాశుల సమస్యల పరిష్కారానికి
ప్రతిఫలాలను ఆశించక సకర్మలను ఆచరించవలెనని 
అంతర్యామి కోటి సూర్యుల తేజోమయుడైన 
ఆ పరమాత్మను పార్థునివలె దివ్యదృష్టితో 
దర్శించవలెనని ప్రభోదిస్తున్న...
ఓ సుఖజీవన వేదమే...ఈ భగవద్గీత

దుష్టశిక్షణ శిష్టరక్షణ‌చేసే శ్రీకృష్ణపరమాత్మ
ధనుర్ధారి ధర్మపరాయణుడైన అర్జునుడున్నచోట
విజయాలు సిరి సంపదల గుప్తనిధులుండునని 
ఈ జీవితమే ప్రాపంచిక సుఖాల పరుగుపందెమని
సందేహల సమస్యల చింతల చీకట్ల విషవలయమని
శ్రీ కృష్ణపరమాత్మ పదసన్నిదే 
ఒక దివ్యమైన దేవాలయమని బోధించి మదినిదోచే...
ఓ మానస సరోవరమే...ఈ భగవద్గీత 
చేతి వ్రాతను విధివ్రాతను భాగ్యరేఖగా మార్చి
ప్రతిమనిషిలో మానవతా పరిమళాలను నింపే
ఓ గాయత్రి మంత్రమే...ఈ భగవద్గీత...

చేతిగీతను 
విధివ్రాతను 
భాగ్యరేఖగా మార్చి 
మనిషి మనిషిలో
మానవీయ విలువల్ని
మానవతాపరిమళాల్ని నింపే...
ఓ గాయత్రీమంత్రమే...భగవద్గీత 

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
Email.kpl97119711@gmail.comకామెంట్‌లు