బాధ్యత;-కె. వెంకట రమణ రావు
 పక్కింటి అంకుల్ కి జ్వరం గా ఉందిట  మందులు కావాలి ,ఒక సారి మెడికల్ షాప్ కి వెళ్లి రా అంటూ కొడుకు సూర్య ని  నిద్ర లేపింది వాళ్ళ అమ్మ  . అంకుల్ కి బాగా లేక  పోతే నన్నెదుకు లేపుతావు   ఒక్క నిముషము కూడా నన్ను నిద్ర పోనివ్వవు కదా  అంటూ మళ్ళీ నిద్ర లో జారుకున్నాడు సూర్య. అర్జెంటు రా అందుకే చెప్పాను , అయినా టైం చూడు  ఎనిమిది దాటింది ఇంకా నిద్ర ఏంటి రా మంచం దిగు అంటూ మళ్ళీ కుదిపింది. 
ఏమండీ సూర్య వెళ్లాడా , డాక్టర్ అరగంట లో మందు వెయ్యాలి అని చెప్పాడు అని లోపలికి  వచ్చింది పక్కింటి ఆంటీ . సూర్య వెళ్తాడు  మీరు కంగారు పడకండి అంటూ  సర్ది చెప్పింది.
సూర్య మళ్ళీ నిద్ర లో జారుకున్నాడు. కొన్ని నెలల క్రితం సూర్య కి విపరీతమయిన జ్వరం వచ్చినపుడు , రాత్రి మందులు లేవు ,పక్కింటి ఆంటీ సూర్య దగ్గ రే కూర్చుంది .ఐస్ వాటర్  తో వొళ్ళు తుడుస్తూ అంకుల్ ని మందులు తీసుకు రమ్మంది. ఆటో లో  వెళ్లి రాత్రి అంకుల్ మందులు తీసుకు వచ్చి సూర్య కి తానే దగ్గర ఉంది టెంపరేచర్ చూస్తూ ఆ రాత్రి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు.
ఇవాళ ఆ అంకుల్ జ్వరం తో ఉంటె నేను ఎం చెయ్య లేక పోతున్నా అన్న భావన నాలో కలిగింది. సిటీ  లో ఉన్న అన్నయ్య కి ఫోన్ చేసింది అర్జెంటు గా మందులు కావాలి అని. సూర్య ఇంకా నిద్ర లో నే ఉన్నాడు. ఆంటీ మళ్ళీ వచ్చింది. మా అన్నయ్య తీసుకు వస్తున్నాడు మీరు కంగారు పడకండి అని చెప్పి అంకుల్ వాళ్ళ ఇంట్లో కి వెళ్ళాను. అంకుల్ చాల ధైర్యం గా ఉన్నారు , ఏమీ లేదమ్మా మందు పడితే రెండు రోజుల్లో తగ్గుతుంది, మీ ఆంటీ అనవసరం గా కంగారు పడుతోంది అన్నారు. సూర్య రాత్రి చాలా లేట్ గా పడుకున్నాడు , లేవలేదు , మా అన్నయ్య కి చెప్పాను , మందులు వస్తాయి అంకుల్ కొంచం వెయిట్ చేయండి అన్నాను. ఒక అర గంటలో అన్నయ్య  మందులు తెచ్చి ఇచ్చాడు. అంకుల్ దగ్గర కూర్చుని తానే మందులు వేసాడు. నీకు శ్రమ ఇచ్ఛానయ్యా నేను అన్నారు , అదేంటి అంకుల్ నేను వూరు లో లేనప్పుడు మా చెల్లెలిని , సూర్యని మీరు తల్లి తండ్రుల్లాగా చూసుకుంటున్నారు . ఇందులో శ్రమ ఏంటి. మీరు కొంచం సేపు నిద్ర పోండి అంటూ అన్నయ్య మా ఇంట్లోకి దారి తీసాడు. సూర్య అప్పుడే లేచాడు, హాయ్ మామయ్యా ఏంటి ఇంట పొద్దున్నే వచ్చావు అంటూ అన్నయ్య పక్కన కూర్చున్నాడు. 
సూర్యా, ఇదేమీ బాగా లేదు ,పక్కన ఇంటి అంకుల్ కి అంత ఫీవర్ గా ఉంటె , నువ్వు వెళ్లి సహాయం చెయ్యాలి  కదా. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ళే కదా చూస్తున్నారు. బాధ్యత నేర్చుకోవాలి. చిన్న పిల్లాడివి కావు నువ్వు. మీ నాన్న కూడా లేడు, అమ్మని ఎంతో బాధ్యత గా చూసుకోవాలి. ఎప్పుడు ఎవరికీ ఏ అవసరం వచ్చిన వెంటనే సహాయం చెయ్యాలి. ఒక సారి గుర్తు చేసుకో, హాల్ టికెట్ మరిచిపోయి ఎక్సమ్ కి వెళ్ళావు. అంకుల్ నీ వెనకాల ఆటో లో వచ్చి నీకు స్కూల్ లో హాల్ టికెట్ ఇచ్చారు. లేకపోతే  పరీక్ష తప్పే   వాడివి. అలాగే ఒక సారి నీకు జ్వరం వచ్చినప్పుడు నేను ఊరు లో లేను , రాత్రి పరిగెత్తుకుని వెళ్లి నీకు మందులు తెచ్చి రాత్రి అంతా నీ పక్కనే కూర్చుని అమ్మకి ధైర్యం చెప్పారు అంకుల్ వాళ్ళు .
నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు. సాటి మనిషికి మనం చెయ్య గలిగిన సహాయం ఎప్పుడూ చెయ్యాలి ఎందుకంటే ఎప్పుడు మనకి ఏ అవసరం వస్తుందో తెలీదు . ఒక బాధ్యత ఉన్న మనిషి గా ఎదగాలి నువ్వు. కొంచం సేపయ్యాక వెళ్లి అంకుల్ ని చూడు. అక్కడ కూర్చుని మందులు ఇవ్వు. ఆంటీ కి ధైర్యం చెప్పు . తెలిసిందా అని మందలించాడు అన్నయ్య. 
సిగ్గు తో తలా దించుకున్న సూర్య , నువ్వు చెప్పింది నిజం మామయ్యా , పక్కింటి వాళ్ళు  ఎంతో మంచివారు. నేను నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ అంకుల్ వాళ్ళ ఇంట్లో కి దారి తీసాడు.


కామెంట్‌లు