చెలికాడు;-రాధా కుసుమ;-కలం స్నేహం
చలువరాతి  మేడలో
 వున్నా ఓ కుర్రవాడా
చిలిపి చూపుల గాలం ఏలరా
చందమామ సోయగాలతో అందగాడా
చెలియకై ఎదురు చూపులు చూడకురా...!

చిన్నెల వన్నెల కిన్నెరను నేను
చెంగల్వ పూదండ నైనా
చిరునవ్వుల మోము నేడు
చెలిమి కి దూరమై విలపి‌‌స్తున్నాను
చెంత చేరలేని బంధీనైనాను...!

చౌర్యం చేసి ఖైదీ కాబడ్డాను
చేతనం లేక శూన్య నిశీధినై
చింతల బాటలో కృషిస్తున్నాను
చేరలేక వీడలేక కంటకాలలో
కన్నీటి గాథనైనాను
చీదరింపుల పలుకులతో
చుట్టూ మూగజీవాలతో నివసిస్తున్నాను
చూడబోకురా నా కొసం...!

చకోరమై నిరిక్షించి తి నాడు
చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో నేడు
చెలికాని వీడి జీవించలేక
చొరవ చూపలేక నిలిచిన
విధి వంచితను ...!


కామెంట్‌లు