అరుణరాగం ...!! >ఆన్షీలు; --.కెఎల్వి.ప్రసాద్> హన్మకొండ.
 నా పుట్టినరోజు అమ్మ ప్రత్యేకంగా గుర్తుకువస్తుంది 
ఆ రోజంతా నాకు ఆనంద సంక్రాంతి అవుతుంది ...!
జనవరి,పదమూడు ,'బోగి 'నాడు పుట్టానట లెండి 
వినుము  కెఎల్వీ.మాట నిజము సుమ్ము......!!
-----------------------------------------------------------------
ఖద్దరుచొక్కా,కాకి నిక్కరూ నా స్పెషల్ డ్రెస్అప్పుడు
వాటితోనే సంక్రాంతి ,వాటితోనే పుట్టినరోజు పండుగ
వాటితోనే అందనిద్రాక్షపండ్లు అందుకున్నంతసందడి
వినుము కెఎల్వి మాట  నిజము సుమ్ము .....!!
------------------------------------------------------------------- 
అప్పటికి నాకు అదియేచెప్పలేని గొప్ప బహుమతి..
వెలకట్టగ లేని సంబరాల సంతోష సమయమది....
నాకోసంమాఅమ్మ ఎన్ని దు:ఖపుగడియలుగడిపెనో!
వినుము కెఎల్వీ.మాట నిజము సుమ్ము .....!!
-----------------------------------------------------------------
పండుగలోమార్పులేదు,మనుష్యలలోమార్పువచ్చే
బీరువాలనిండా బోలెడు మడతలూడని బట్టలున్నా
కొత్తబట్టలకుసైతం కొదవలేకున్నా నాటిఆనందమేది?
వినుము కెఎల్వీ.మాట నిజము సుమ్ము.....!!
------------------------------------------------------------------
నాడు అమ్మ ప్రేమ,ఆత్మీయత కలిపి వండిన.....
ఆనాటి,నూకలజావకూ,పాలన్నముకూ సరిరావుఏవీ
ప్రేమలు సైతము అన్నిటివలే యాంత్రికములైపోయే!
వినుము కెఎల్వీ.మాట  నిజము సుమ్ము....!!
------------------------------------------------------------------ 

కామెంట్‌లు